English | Telugu
దీపిక పిల్లిపై విరుచుకుపడుతున్న ఫ్యాన్స్!
Updated : Jan 20, 2024
ఇప్పుడంతా ఇన్ స్టాగ్రామ్ హవా నడుస్తుంది. కొందరు సెలబ్రిటీలు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోతే.. మీరు ఉన్నారా? పోయారా అని అడుగేస్తున్నారు. ఇంకాస్త పెద్ద సెలబ్రిటీలు అయితే తమ ఫ్యాన్స్ తెగ బాధపడిపోతుంటారు. సెలబ్రిటీలు సోషల్ మీడియాలో యాక్టవ్ గా ఉంటే తమ ఫ్యాన్స్ కి దగ్గరగా ఉన్నట్లు ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు దీపిక పిల్లికి అదే పరిస్థితి ఎదురైంది.
దీపిక పిల్లి ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్యూటీ. ఇప్పుడు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కన్పించడం లేదు. అయితే తను ఎందుకు కన్పించడం లేదో ఎవరికీ తెలియదు. అయితే తాజాగా తన ఫ్యాన్స్ తో ముచ్చటించింది దీపిక. ఒక అభిమాని అయితే రెచ్చిపోయి ఆపుకోలేక అడిగేశాడు. " ఎక్కడికి పోయావ్ పాప? పత్తా, జాడా లేకుండా పోయావ్.. నీకు ఫ్యాన్స్ ఉన్నారని మర్చిపోయావా? వాళ్లకి ఫీలింగ్స్ ఉంటాయని మర్చిపోయావా" అని అడుగగా.. దానికి దీపిక ఫన్నీగా రిప్లై ఇచ్చింది.
"ఢీ" షోలో యాంకర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది దీపిక. అంతకముందు టిక్ టాక్ వీడియోలలో ఆకట్టుకున్న దీపిక. సోషల్ మీడియాలో ఫ్యాన్ బేస్ పెంచుకుంది. 'వాంటెడ్ పండుగాడు' సినిమాతో వెండితెరపై కనువిందు చేసింది ఈ బ్యూటీ. ఆ మధ్య ఆహాలో ' కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్' పేరుతో మొదలైన స్టాండప్ కామెడీకి తను యాంకర్ గా చేసింది. గ్లామర్ రోల్ కి ఏమాత్రం తీసిపోనంటూ దీపిక రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్స్ చేస్తూనే ఉంటుంది. అయితే ఈ మధ్య ఎక్కువగా ఇన్ స్టాగ్రామ్ లో తను కన్పించకపోయేసరికి ఓ అభిమాని ఎమోషనల్ గా మెసెజ్ చేశాడు. అది ఇప్పుడు వైరల్ గా మారింది.