English | Telugu

సుధీర్ చెంప చెళ్లుమనిపించిన రష్మి.. వీడియో వైరల్!

బుల్లితెరపై యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్ జోడీకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కెమెరా ముందు వీరు చేసే రొమాన్స్ ఓ రేంజ్ లో పడుతుంది. ఏ షో అయినా.. సుధీర్, రష్మీ జోడీ కనిపించిందంటే ఆ కిక్కే వేరు. అంతటి క్రేజ్ ఉన్న ఈ జోడీ తాజాగా విడుదలైన ఢీ ప్రోగ్రామ్ ప్రోమోలో ఊహించని షాకిచ్చింది. అందరి ముందే సుధీర్ చెంప చెళ్లుమనిపించింది ర‌ష్మి!

ముందుగా సుధీర్ కు రెండు ఇవ్వాలని ఉందంటూ వేదిక మీదకు వచ్చిన రష్మీ.. మొదట స్వీట్ హగ్ ఇచ్చి.. ఆ వెంటనే చెంపపై ఒక్కటి ఇచ్చింది. "ఫస్ట్ నీ పెర్ఫార్మన్స్ కు హగ్" అని చెప్పిన ఆమె.. సెకండ్, "నీ కాలు బాగాలేదు అయినా.. జనాలకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మా సుధీర్ ఎప్పటికీ వెనుకాడడు." అంటూ సుధీర్ చెంపపై ప్రేమగా కొట్టింది. ఈ చర్యకు మొదట అందరూ షాక్ అయినప్పటికీ ఆ తరువాత తేరుకొని చప్పట్లు కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.

చాలా కాలంగా ఈ జంట ప్రేమలో ఉందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి. యూట్యూబ్ లో అయితే ఈ జంటకు సంబంధించిన ఎప్పటికప్పుడు వీడియోలు క్రియేట్ చేస్తూనే ఉంటారు. తమ రిలేషన్ పై స్పందించిన సుధీర్, రష్మీ... తమ మధ్య నడిచేది వెండితెర కెమిస్ట్రీ తప్ప రియల్ లైఫ్ లో ఎలాంటి లవ్ ట్రాక్ లేదని తేల్చి చెప్పింది. అయినప్పటికీ మళ్లీ మళ్లీ అవే వార్తలు హాట్ టాపిక్ అవుతుండడం చూస్తున్నాం.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.