English | Telugu

టాప్‌లో 'కార్తీక దీపం'.. నెక్స్ట్ ఏ సీరియల్?

తెలుగు టెలివిజన్ రంగంలో డైలీ సీరియల్స్ మధ్య రసవత్తరమైన పోటీ జరుగుతోంది. ప్రముఖ ఛానెల్ స్టార్ మా లో ప్రసారమయ్యే 'కార్తీక దీపం', 'గృహలక్ష్మీ', 'వదినమ్మ', 'దేవత', 'జానకి కలగనలేదు', 'గుప్పెడంత మనసు' వంటి సీరియల్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రేక్షకులకు వినోదం పంచుతున్న ఈ సీరియల్స్ కి సంబంధించిన రేటింగ్స్ ఇప్పుడు బయటకొచ్చాయి. బుల్లితెరపై ఆకట్టుకుంటున్న సీరియల్స్ కి సంబంధించి టాప్ 5 రేటింగులువిషయానికొస్తే .. 'దేవత' సీరియల్ ఐదో స్థానానికి పడిపోయింది.

గతవారం టీఆర్పీలో 'దేవత' సీరియల్ నాలుగో స్థానంలో ఉండేది. గతంలో 'దేవత' సీరియల్ మూడో స్థానానికి కూడా చేరుకున్న సందర్భాలు ఉన్నాయి. 'దేవత' సీరియల్ కు 'గుప్పెడంత మనసు' సీరియల్ నుండి గట్టిపోటీ ఎదురవుతోంది. ఇక 'జానకి కలగనలేదు' సీరియల్ ప్రస్తుతం టీఆర్పీలో నాల్గో స్థానానికి వెళ్లింది. ఇటీవల మొదలైన ఈ సీరియల్ కి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది.

తాజా రేటింగ్స్ లో 'గుప్పెడంత మనసు' మూడో స్థానాన్ని చేజిక్కించుకుంది. 'గృహాలక్ష్మీ' సీరియల్ రెండో స్థానాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్తుంది. ఇక ఎప్పటిలానే 'కార్తీకదీపం' భారీ రేటింగ్స్ తో టాప్ గేర్ లో దూసుకుపోతుంది. మలయాళం సీరియల్ 'కరుతముత్తు' ఆధారంగా ఈ సీరియల్ ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో నిరుపమ్ పరిటాల, ప్రేమి విశ్వనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.