English | Telugu

హాట్ స‌మ్మ‌ర్‌లో దివి.. ఇన్‌స్టాగ్రామ్‌ను హీటెక్కిస్తోంది!

బిగ్ బాస్ సీజన్ 4లో మోస్ట్ బ్యూటిఫుల్ కంటెస్టెంట్ గా ప్రేక్షకులను అలరించింది దివి. తన సొట్టబుగ్గలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ షోతో అమ్మడుకి సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. చిరంజీవి సైతం త‌న సినిమాలో ఆమెకు ఓ రోల్‌ను ఆఫ‌ర్ చేశారు. మహేష్ బాబు 'మహర్షి' సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన దివి హీరోయిన్‌ గా సెటిల్ అవ్వాలని చూస్తోంది. అందం, అభినయం, ఆకర్షించే రూపం ఉన్న దివి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత తన అందాలకు మెరుగులు దిద్దే పనిలో పడింది.

హాట్ ఫోటో షూట్ లలో పాల్గొంటూ వాటిని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది. ఈ ఫోటోలు చూసైనా దర్శకనిర్మాతలు తనకు అవకాశాలు ఇస్తారని ఈ ముద్దుగుమ్మ ఆశపడుతోంది. తాజాగా దివి షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని బ్లాక్ బ్యాక్ గ్రౌండ్ లో తీసుకున్న ఫోటోలు యూనిక్ గా ఉన్నాయి. దీంతో ఫోటోలు పెట్టిన కాసేపటికే భారీ లైకులు వస్తున్నాయి.

ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు.. 'మేకప్ కాస్త ఎక్కువైంది కానీ చాలా అందంగా ఉన్నావంటూ' కామెంట్స్ చేస్తున్నారు. 'సమ్మర్ కారణంగా బయట హాట్ గా ఉంది.. ఇప్పుడు ఈ ఫోటోలతో మీరు ఇన్స్టాగ్రామ్ లో కూడా హీట్ పెంచుతున్నారంటూ' మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మొత్తానికి దివి షేర్ చేసిన ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

వేరే స్టేట్ అమ్మాయితో అఖిల్ పెళ్లి...

చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కేలో సుమ క్యారెక్టర్స్ చేంజ్ చేసి అసలు వాళ్ళ స్టోరీలను బయటకు తీసుకొచ్చింది. అఖిల్ - అమరదీప్ జోడిగా కాంటెస్ట్ చేస్తున్నారు. ఐతే అమరదీప్ ని అమ్మాయిగా నటించాలని అఖిల్ ని అబ్బాయిగా నటించాలని చెప్పింది. ఒకరి బాధలు ఒకరు చెప్పుకోవాలి అంది. అమరదీప్ తన బాధ చెప్తూ "అతను నాతో చేయించుకోవాల్సినవన్నీ చేయించుకున్నాడు పెళ్లి ఎప్పుడూ అంటే పెళ్ళాం ఒప్పుకోవాలి అన్నాడు" అంటూ అమరదీప్ ఏదో కథ చెప్పేసరికి అక్కడే ఉన్న మానస్ ఇదేదో అమరదీప్ కథలానే ఉందే అంటూ అసలు విషయం చెప్పేసాడు. "అరేయ్ నిన్నెవరు అడిగ్గార్రా" అంటూ అమరదీప్ కంగారుపడ్డాడు.