English | Telugu

'ఫైనల్లీ నేను నటించిన మూవీ..బొమ్మ బ్లాక్ బస్టర్ రిలీజ్ కాబోతోంది'

రష్మీ బుల్లితెర మీద జబర్దస్త్ యాంకర్. ఐతే రష్మీ మూవీస్ లో కూడా అప్పుడప్పుడు నటిస్తూ ఉంటుంది. ఇప్పుడు "బొమ్మ బ్లాక్ బస్టర్" అనే మూవీలో నందుతో పాటు నటించింది. ఇప్పుడు ఆ మూవీ నవంబర్ 4th న రిలీజ్ కాబోతోంది అంటూ రష్మీ తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేసింది. "ఫైనల్లీ నేను నటించిన మూవీ రిలీజ్ కాబోతోంది. కోవిడ్ కి ముందు ఈ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసాం .

కానీ కోవిడ్ కారణంగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ మొత్తం ఎంతలా తారుమారైపోతుందో అప్పటికి ఊహించలేకపోయాను. ఏదేమైనా ప్రాజెక్ట్ పూర్తయ్యింది." అని కామెంట్స్ పెట్టుకుంది. ఇక ఈ మూవీ పోస్టర్స్ తో నెటిజన్స్ చేసిన ట్రోల్ల్స్, మీమ్స్ ని కూడా తన ఇన్స్టాగ్రామ్ స్టేటస్ లో పెట్టేసుకుని ఎంజాయ్ చేస్తోంది. ఇక దీపికా పిల్లి ఇటీవలే సుధీర్ తో కలిసి "వాంటెడ్ పండుగాడ్" లో నటించింది.

ఇప్పుడు ఈమె కూడా "వెయిటింగ్ అక్కా నీ మూవీ కోసం" అని కామెంట్ చేసింది. ఇక ఈ మూవీని రాజ్ విరాట్ డైరెక్ట్ చేశారు. గుంటూరు టాకీస్ తో భారీ ఎత్తున విమర్శలను ఎదుర్కున్న రష్మీ ఇప్పుడు ఈ మూవీతో ఎలా ఎంటర్టైన్ చేస్తుందో ఈ మూవీతో ఎలాంటి ఫేమ్ తెచ్చుకుంటుందో చూడాలి.