English | Telugu

రోహిత్ త్యాగానికి విలువ లేదా?

బిగ్ బాస్ హౌస్ లోకి జంటగా అడుగుపెట్టిన మెరీనా-రోహిత్ ఇద్దరు కూడా బాధలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం ఈ వారం జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో హౌస్ మేట్స్ తీరుతో రోహిత్ బాధపడ్డాడు. తన త్యాగానికి విలువ లేదా అన్నట్లు ప్రేక్షకులు భావిస్తోన్నారు.

నిన్న మొన్నటి వరకు కొనసాగిన ఈ టాస్క్, మెరీనా-రోహిత్ జంటను బాధ పెడుతోందనే చెప్పాలి. హౌస్ లో దాదాపుగా అందరు తమ ఫ్యామిలీతో మాట్లాడారు. కానీ అవకాశం రానిది మెరీనా-రోహిత్ జంటకి మాత్రమే. హౌస్ మేట్స్ ఎవరు కూడా తన త్యాగానికి విలువ ఇవ్వలేదు అని బాధపడ్డాడు రోహిత్. కాగా నిన్న జరిగిన ఎపిసోడ్ లో చివరి కెప్టెన్సీ టాస్క్ లో తనకి వచ్చిన అవకాశాన్ని లాగేసుకుంది సుదీప. అలా చేసినందుకు కొందరు సుదీప చేసింది తప్పు అని కూడా చెప్పారు. కెప్టెన్సీ టాస్క్ లో ఎనిమిది మంది పోటీదారులుగా ఉండగా, చివరగా సూర్య, రోహిత్ మిగిలారు. కాగా రోహిత్ కి హౌస్ మేట్స్ ఎవరూ సపోర్ట్ చెయ్యకపోగా, " సెల్ఫ్ నామినేట్ అయ్యినంత మాత్రాన సపోర్ట్ చెయ్యాలని ఏం లేదు. ఒకవేళ సెల్ఫ్ నామినేట్ కాకపోయినా, కచ్చితంగా నామినేషన్ లో ఉండేవాడు." అంటూ సూర్య తో చెప్పుకొచ్చింది గీతు. ఇది చూసిన ప్రేక్షకులకు సైతం ఇది అన్ ఫేయిర్ లా అనిపించింది. కెప్టెన్సీ టాస్క్ లో వెనక్కి తగ్గకు అంటూ గీతు, సూర్యతో చెప్పగా, రోహిత్ ఫీల్ అయినట్టుగా కనిపించాడు.

కెప్టెన్సీ టాస్క్ లో ఆశ్చర్యం కలిగించే మరో విషయం ఏంటి అంటే రోహిత్ భార్య మెరీనా కూడా రోహిత్ కి సపోర్ట్ చెయ్యకుండా సూర్యకి ఓట్ చేసింది. దీంతో అటు హౌస్ మేట్స్ తో పాటు, ఇటు షో చూసే ప్రేక్షకులు సైతం షాక్ అయ్యారు. ఇంకా హౌస్ మేట్స్, రోహిత్ గురించి కొన్ని నెగటివ్ పాయింట్స్ చెప్పారు. "నువ్వు అందరిలో కలవవు. ఇంట్రోవర్ట్ గా ఉండకు" అంటు శ్రీసత్య చెప్పేసింది. ఎక్కువ ఎందులో పార్టిసిపేషన్ ఉండదు అని ఇలా ఒక్కొక్కరుగా తమ కారణాలు చెప్పి, సూర్యకి మద్దతుగా ఎక్కువ ఓట్లు రావడంతో సూర్య కెప్టెన్ అయ్యాడు. రోహిత్ చాలా సార్లు కెప్టెన్ పోటీదారుడిగా ఎన్నికయ్యాడు. గత వారం కూడా కీర్తి భట్, రోహిత్ ఉన్నప్పుడు హౌస్ లో లేడీ కెప్టెన్ ని చూడాలనుకుంటున్నా అని ఇనయా చెప్పి, కీర్తి భట్ కి సపోర్ట్ గా తనని కెప్టెన్ చేయగా, రోహిత్ ఫీల్ అయ్యినట్టుగా అనిపించింది.

కాగా చివరి వరకు వచ్చినా, ఎవరు సపోర్ట్ చెయ్యలేదు అని బాధపడ్డాడు రోహిత్. అయితే తన పట్ల ప్రేక్షకులు సింపతితో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే నామినేట్ అయిన రెండు వారాలు కూడా సేవ్ చేస్తూ వచ్చారు. వచ్చే వారం అయిన రోహిత్ కెప్టెన్ అవుతాడేమో అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..