English | Telugu

మందు తాగి ఇంటికొచ్చినప్పుడు వైఫ్ కి దొరికిపోతున్నా..సొల్యూషన్ ప్లీజ్ అన్న ఫ్యాన్

ఉస్తాద్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ కి స్టార్ హల్క్, భల్లాలదేవా రానా దగ్గుబాటి ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ షోకి హోస్ట్ మంచు మనోజ్ సూట్ వేసుకుని వచ్చేసరికి "సూట్ వేసుకున్నాడని అంత డిసిప్లిన్ అని ఎవరూ అనుకోవద్దు" అంటూ రానా కౌంటర్ ఇచ్చాడు. ఇక రానా కోసం కొంతమంది ఫాన్స్ రాసిన లెటర్స్ ని మంచు మనోజ్ చదివి వినిపించాడు. "నమస్తే రానా అన్న..నాకు రీసెంట్ గా పెళ్లయింది..మందు తాగి ఇంటికొచ్చినప్పుడు వైఫ్ కి దొరికిపోతున్నా" సొల్యూషన్ చెప్పాలంటూ అడిగేసరికి రానా కామెడీగా రియాక్ట్ అయ్యాడు.."వీడు గ్యారెంటీగా నీ ఫ్యాన్ అబ్బాయి" అని రానా చెప్పేసరికి మనోజ్ నవ్వేసాడు. "మీరు...మీ సెలబ్రిటీ ఫ్రెండ్ ఇద్దరూ కలిసి ఒకే అమ్మాయిని ఫ్లర్ట్ చేశారా" అని ఒక ఆడియెన్ అడిగేసరికి దానికి ఆన్సర్ మాత్రం చెప్పలేదు. తర్వాత ఒక టాస్క్ కూడా ఆడించాడు..ఏజ్ వైజ్ గా హీరోయిన్స్ పోస్టర్స్ వేస్తాను..అవన్నీ ఆర్డర్ లో పెట్టాలి అనేసరికి "నాకు ఒరిజినల్ ఏజ్ తెలిసి నీకు వికీపీడియాలో ఏజ్ తెలిస్తే ఇన్ఫర్మేషన్ నాదే కరెక్ట్ అవుతుందిగా" అనేసరికి "అందరికీ ఏది తెలుస్తుందో నీకు అదే తెలియాలి నీ పర్సనల్ గా ఎం చెప్పారో మాకెందుకు" అని మనోజ్ రివర్స్ కౌంటర్ వేసాడు. ఇక రానాతో గేమ్ ఆడదానికి వచ్చిన ఫ్యాన్ ఒక అద్భుతమైన డాన్స్ వేసి అందరినీ ఎంటర్టైన్ చేసాడు.."మీరేస్తున్న ఆ డాన్స్ ఏమిటి" అని మనోజ్ అడిగేసరికి "ఫిన్లాండ్ లో వేసే డాన్స్" అని ఆ ఫ్యాన్ రివర్స్ పంచ్ ఇచ్చాడు. "ఎక్కడ నుంచి పట్టుకొచ్చారబ్బా ఇంతా వైల్డ్ గా ఉన్నాడు ఈ ఫ్యాన్" అని మనోజ్ అనేసరికి "వైల్డెస్ట్ ఫ్యాన్ ఆఫ్ రానా బాబు" అంటూ ఆ ఫ్యాన్ కామెడీ పంచ్ ఇచ్చాడు.