English | Telugu

మగాళ్ళంటే నాకు పిచ్చి ప్రాణం అన్న రష్మీ

డిసెంబర్ 31 వచ్చేస్తోంది. ఇక ఇయర్ ఎండింగ్ అంటే ఆ సెలెబ్రేషన్స్ లెవెల్ వేరే ఉంటది. అందులోనూ ఇయర్ ఎండింగ్ కూడా సండే వచ్చేసరికి బుల్లితెర మీద వినోదం మాములుగా ఉండదు మరి. ఇక ఈ సండే రష్మీ పెళ్లి పార్టీ పేరుతో ఒక ఈవెంట్ తెలుగు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి రాబోతోంది. ఇందులో బోల్డంత మంది సెలబ్రిటీలు కనిపించబోతున్నారు. చమ్మక్ చంద్రకి రష్మీ మొగుడు గురించిన పాఠాలు చెప్పేసరికి షాకయ్యాడు.

బాబా మాస్టర్ పంచులు వేసాడు. "మగాడు చాల గొప్పోడు..ఆడపిల్లకు తాళి కట్టి ఆలీని చేసుకుంటాడు...తన పక్కన పడుకోవడానికి చోటిస్తాడు. సంవత్సరం తిరగ్గానే సంకలోకి బిడ్డనిస్తాడు...మగాళ్ళంటే నాకు పిచ్చి ప్రాణం" అని రష్మీ అనేసరికి "మగాళ్ళంటే నీకు ఇంత గౌరవం ఉందన్న విషయం నాకు తెలీదు" అని చమ్మక్ చంద్ర అనేసరికి హైపర్ ఆది, పవిత్ర పడీ పడీ నవ్వేశారు.

ఇక రష్మీ ఎప్పుడూ ఈ ఎపిసోడ్ లో కనిపించని విధంగా పట్టుచీరతో కనిపించి హోమ్లీగా ఉండేసరికి "ఇంత అభినయం ఏ ఎపిసోడ్ లోనూ చూడలేదు రష్మీ" అన్నాడు చమ్మక్ చంద్ర.."పేమెంట్ బట్టి పెర్ఫార్మెన్స్ ఉంటుంది" అంటూ రివర్స్ కౌంటర్ వేసింది రష్మీ. ఇక ఈ షోలో డాన్స్ పెర్ఫార్మెన్సెస్ తో బాబా మాష్టర్ అమ్మ రాజశేఖర్ మాష్టర్ ఇద్దరూ ఇరగదీసేసారు..ఇక లాస్ట్ లో మ్యాజిక్ షో కూడా హైలైట్ గా నిలిచింది. ఇక ఈ ప్రోమో చూసాక ఒక నెటిజన్ ఐతే "ముందు పెళ్లి చేసుకో రష్మి ...తర్వాత పార్టీ ఇద్దువు గానీ... ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటావ్ రష్మీ రియల్ గా చేస్కో చూస్తాం" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..