English | Telugu

'డ్యాన్స్ ఐకాన్' షో జడ్జిగా రమ్యకృష్ణ.. కొత్త రమ్యని చూస్తారు!

విభిన్న పాత్రలతో నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న రమ్యకృష్ణ ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో ప్రసారమయ్యే 'డ్యాన్స్ ఐకాన్' షో కోసం జడ్జిగా మారారు. ఆమెతో పాటు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూడా జడ్జిగా ఈ షోతో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. ఓంకార్ యాంకర్ గా, నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ షో ఇటీవల గ్రాండ్ గా లాంచ్ అయింది. లాంచ్ ఎపిసోడ్ నిన్న(సెప్టెంబర్ 11న) ఆహాలో స్ట్రీమ్ అయింది. సెప్టెంబర్ 17 నుండి ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ఈ షో ప్రసారం కానుంది.

ఓటీటీలో న్యాయనిర్ణేతగా తన అరంగేట్రం గురించి రమ్యకృష్ణ మాట్లాడుతూ.. "డ్యాన్స్ ఐకాన్ వంటి షోతో ఆహాలో జడ్జిగా ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉంది. ఇలాంటి ఫార్మాట్ ఈమధ్య కాలంలో ఎవరూ చేయలేదు. ఈ షో ద్వారా అందరూ కొత్త రమ్యని చూస్తారు" అన్నారు.

ఓంకార్ మాట్లాడుతూ.. "రమ్యకృష్ణ గారు ఈ షోకి జడ్జిగా వ్యవహరించడం చాలా ఆనందంగా ఉంది. ఆమెతో పని చేయాలనే నా కల ఈ షోతో నెరవేరడం సంతోషంగా ఉంది. ఈ షో ద్వారా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందిస్తాం" అన్నారు.

రమ్యకృష్ణ ఎంతోమందికి రోల్ మోడల్. డ్యాన్స్ పై ఎంతో అవగాహన ఉన్న ఆమె డ్యాన్స్ ఐకాన్ కు జడ్జిగా రావడం సంతోషంగా ఉందని ఆహా సీఈఓ అజిత్ ఠాకూర్ అన్నారు.