English | Telugu

ఫైమా ఫ్లవర్ అనుకుంటిరా.. కాదు ఫైర్!

ఇటీవల బిగ్ బాస్ హౌస్‌మేట్స్‌కు హోస్ట్ నాగ్ ఒక సరదా టాస్క్ ఇచ్చారు . "హౌస్ లో బుట్ట బొమ్మ ఎవరు అని నీ ఉద్దేశం?" అంటూ బాలాదిత్యను అడిగారు నాగ్‌. "మెరీనా" అనేది ఆదిత్య ఆన్సర్. "ఎంత సేఫ్ గేమ్ ఆడావు బాలాదిత్య" అన్నాడు నాగ్. "ఇక్కడున్న ఆడపిల్లల్లో బంతి పువ్వు ఎవరు?" అని అడిగితే, "శుభానికి సూచిక బంతిపువ్వు కాబట్టి ఈ ఇంటికి సుదీప బంతిపువ్వు" అని చెప్పాడు.

తర్వాత శ్రీసత్యను శేఖర్ కమ్ముల సినిమాలో "హైబ్రిడ్ పిల్ల"గా అభివర్ణించాడు. అభినయశ్రీ "చాలా ప్రౌడీ అండ్ డైనమిక్", కీర్తిభట్ "బంగారు తల్లి", నేహా చౌదరి "స్ప్రింగ్", ఇనయా సుల్తానా "మిస్ స్మైల్", ఆరోహి రావు "సీమటపాకాయ్" అని అంటాడు. ఆరోహిని ఉద్దేశించి, "తనను పైకి చూసి చాలా సాఫ్ట్ అనుకున్న కానీ హౌస్ లో ఒక ఇష్యూ జరిగినప్పుడు తనని చూసి మామూలు సీమటపాకాయ్ కాదు థౌజండ్ వాలా అని ఫిక్స్ అయ్యా" అన్నాడు బాలాదిత్య. "వాసంతి ఎప్పుడూ రెడీ గా ఉంటుంది.. ఈరోజే వీకెండా అన్నట్టుగా ప్రిపేర్డ్ గా ఉంటుంది. గ్లామర్ ఆఫ్ బిబి హౌస్" అని చెప్పాడు.

ఫైమా వంతు వచ్చేసరికి తను హ్యూమర్ బాగా చేస్తుందన్నాడు బాలాదిత్య. "నేను తనని వర్ణించమన్నాను కానీలక్షణాలు చెప్పమనలేదు" అని నాగ్ అన్నాడు. అప్పుడు "ఫైమా ఒక ఫ్లవర్ సర్.. ఫ్లవర్ అంటే ఫ్లవర్ కాదు ఒక ఫైర్ సర్" అన్నాడు. "కాదు ఇంకా వర్ణించండి" అని ఫైమా అడిగేసరికి "ఫైమా ఫన్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్" అని చెప్పాడు.

ఇక ఫైనల్ గా "గీతక్క అంటే సీతక్కే" అన్నాడు బాలాదిత్య. "ఊరికే అంతా పైకి డాంబికమే కదా" అన్నాడు నాగ్. మధ్యలో గీతూ వచ్చి, "నేను టెంకాయ లెక్క పైకి గట్టిగా ఉంటా, లోపల స్వీట్ గా ఉంటా" అంటూ తన మీద తానే పంచ్ వేసుకుంది. ఇలా హౌస్ లో ఆడపిల్లలందరినీ తనదైన స్టయిల్లో ఎవరినీ నొప్పించకుండా వర్ణించాడు బాలాదిత్య.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..