English | Telugu
చిన్నకోడలిగా కృష్ణకి భవాని పట్టాభిషేకం చేయనుందా!
Updated : Aug 9, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -230 లో.. గోరింటాకు పెట్టుకొని ఉన్న కృష్ణకి ముక్కు దురదగా ఉందని మురారి తన దగ్గరగా వెళ్ళి ముక్కుపై నిమురుతు రొమాంటిక్ గా చూస్తాడు. నేను వెళ్ళిపోయాక మీరు కట్టిన తాళి తీయను. మీతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటానని కృష్ణ అనుకుంటుంది. మురారి కూడా అలాగే అనుకుంటాడు.
మరొక వైపు కృష్ణ, మురారి గురించి ఆలోచిస్తుంటుంది రేవతి. వీళ్ళ విషయం అసలు అక్కకి చెప్తే అక్కనే అంతా చూసుకుంటుంది. అక్కకి ఎదురు చెప్పేవాళ్ళు ఈ ఇంట్లో లేరని చెప్పాలని రేవతి భవాని దగ్గరకి వెళ్తుంది. నేను నీతో మాట్లాడాలని రేవతితో భవాని అంటుంది. నేను ఒక నిర్ణయానికి వచ్చానని భవాని అంటుంది. ఇన్ని రోజులు మురారి అలా చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడని తింగరి పిల్లపై కోపంగా ఉండేది కానీ ఇప్పుడు కృష్ణ అంటే చాలా ఇష్టంగా మారిపోయిందని రేవతితో భవాని అంటుంది. అందుకే నేను ఇక నిర్ణయం తీసుకున్నా అని భవాని అంటుంది. నా తర్వాత ఇంటిని క్రమశిక్షణగా కృష్ణ చూసుకుంటుంది. అందుకే నా తర్వాత ఇంటి బాధ్యతలు కృష్ణకి ఇద్దామని అనుకుంటున్నా అంతేకాకుండా వంశపార పరంగా వస్తున్న ఏడువారాల నగలు కృష్ణకి ఇద్దామనుకుంటున్నానని భవాని అంటుంది. అది విని, మంచి నిర్ణయం అక్క అని రేవతి అంటుంది. మరొక వైపు కృష్ణ, మురారి ఇద్దరు నిద్ర లేచి ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తారు. ఆ తర్వాత నందు, మధు ఇద్దరు వచ్చి ఇద్దరినీ రెడీ చేసి కిందకి తీసుకొని వస్తారు.ఆ తర్వాత మురారికి కృష్ణ అంటే ఇష్టం కానీ కృష్ణకి మురారి అంటే కొంచెం కూడా ఇష్టం లేదు. కొన్ని రోజుల్లో కృష్ణ ఇంటి నుండి వెళ్ళిపోతుందని నందుతో ముకుంద చెప్తుంది కానీ నందు ముకుంద మాటలని పట్టించుకోదు.
ఆ తర్వాత కృష్ణని తీసుకొని వస్తుంది ముకుంద. తింగరి పిల్ల మీ పెళ్లి మేం చూడలేదు కాబట్టి మళ్ళీ ఈ మాంగల్యధారణ అని భవాని అనగానే.. కృష్ణ, మురారి, ముకుంద షాక్ అవుతారు. ఏంటి ఇదంతా పెద్ద అత్తయ్య ప్లానా అని ముకుంద అనుకుంటుంది. నిన్ను ఈ రోజు నా చిన్న కోడలిగా పట్టాభిషేకం చేస్తున్నాను.. ఏడు వారాల నగలు నీకు అలంకరించి తీసుకొని వస్తానని కృష్ణని భవాని తీసుకొని వెళ్లి.. ఏడు వారాల నగలు కృష్ణకి వేస్తుంది. అత్తయ్య మీకు ఇంత దగ్గర అయ్యాను. మిమ్మల్ని మోసం చేస్తున్నానని కృష్ణ అనుకుంటుంది. భవాని కృష్ణకి నగలు వేసి మురిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.