English | Telugu
రాజ్ ఒక్కడే సేఫ్!
Updated : Nov 16, 2022
ఈ వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ నుండి ఒకరు సేవ్ అవ్వడానికి బిగ్ బాస్ అవకాశం కల్పించాడు. "తమని తాము సేవ్ చేసుకోడానికి, విన్నర్ యొక్క ప్రైజ్ మనీ నుండి కోత విధించడం జరుగుతుంది. బిగ్ బాస్ మీకు చెక్ ఇస్తున్నారు. గార్డెన్ ఏరియాలో ఉన్న డ్రాప్ బాక్స్ లో చెక్ పై తమ ఇమ్యూనిటి పెంచుకోవడం కోసం ఒక ధరను ఎంచుకొని అందులో వేయాలి. ఇమ్యూనిటి ధర ఒక లక్ష నుండి మొదలు అయిదు లక్షల వరకు ఉంటుంది. మీరు ఒక యూనిక్ ధరను ఆ చెక్ పై రాయాలి. అయితే మీరు చెక్ మీద రాసిన అమౌంట్ ని ఏ విధంగా కూడా ఇంటి సభ్యులతో చర్చించకూడదు" అని బిగ్ బాస్ చెప్పాడు.
ఆ తర్వాత ఒక్కొక్కరుగా వచ్చి తమకి నచ్చిన అమౌంట్ ని రాసి, డ్రాప్ బాక్స్ లో వేసారు. అయితే శ్రీసత్య కోడ్ భాషలో తను రాసిన అమౌంట్ ని శ్రీహాన్ కి చెప్పింది. "శ్రీసత్య, అలా మాట్లాడటం తప్పు. మీరు చేసింది స్పష్టంగా తెలుస్తుంది. అలా చెప్పినందువల్ల మీరు ఈ పోటీ నుండి తొలగించబడ్డారు" అని బిగ్ బాస్ చెప్పాడు.
కాగా రేవంత్, కీర్తి భట్ ఇద్దరు ఒకే నెంబర్ రాయడం వల్ల రిజెక్ట్ అయ్యారు. ఇనయా, మెరీనా రెండవ అత్యధిక మొత్తాన్ని రాసారు. కాబట్టి వారిని కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఆదిరెడ్డి, శ్రీహాన్ ఇద్దరు సేమ్ రాసారు కాబట్టి వీరిద్దరు కూడా తొలిగిపోయారు. చివరగా రోహిత్ రెండు లక్షలు రాయగా, రాజ్ నాలుగు లక్షలు రాసాడు. కాబట్టి రాజ్ అందరి కన్నా హై యూనిక్ వాల్యు రాసినందువల్ల, ఈ వారం ఎలిమినేషన్ నుండి సేఫ్ అయ్యాడు.