English | Telugu

‘నా పేరు సూర్య’ మూవీని తారక్ తో చేయాల్సింది

ఆలీతో సరదాగా షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈ షోకి వక్కంతం వంశి వచ్చారు. ఈ షోలో ఆయన ఎన్నో ఇంటరెస్టింగ్ విషయాలు కూడా చెప్పారు. ‘‘నా జీవితంలో ఒక రచయితగా మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం ‘కిక్‌’. ‘నా పేరు సూర్య’ మూవీ ఒరిజినల్‌గా తారక్‌తో చేయాల్సిన చిత్రం. ఆయనే నన్ను డైరెక్టర్ ని చేస్తానని చెప్పారు ఐతే అప్పటికే టెంపర్ మూవీ ఐడియా చెప్పాను. అలా ఆయన ఆ మూవీని చేయలేదు తర్వాత అల్లు అర్జున్ కి కథ వినిపించాను ఆయన ఓకే చేశారు అని చెప్పారు.

ఇక ఈ షో మధ్యలో ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు వక్కంతం వంశీ భార్య ఒకప్పటి ‘ఆట’ ఫేమ్‌ శ్రీవిద్య వచ్చారు. "కొంతకాలం క్రితం వరకు సోషల్ మీడియాలో కనిపించేదానివి ఈ మధ్య ఎందుకు కనిపించట్లేదు ఎవరైనా నీ మనసును బాధ పెట్టారా" అని ఆలీ అడిగేసరికి " బాధ కంటే పెద్ద పదం ఏదీ లేదు" అని కన్నీటి పర్యంతమయ్యింది శ్రీవిద్య. ఇక తన మనసులో తన బిడ్డ గురించి చెప్తూ ఏడ్చేసరికి ఆలీ కూడా ఈ షోలో కన్నీళ్లు పెట్టుకున్నారు.