English | Telugu
కావ్య పెట్టిన ప్రెస్ మీట్ తో రచ్చ.. మళ్ళీ మొదలైంది!
Updated : Aug 12, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -172 లో.... కావ్య వాళ్ళింటికి వెళ్లి పనిచెయ్యడం వల్ల మీడియా లో వచ్చి దుగ్గిరాల ఇంటి పరువుపోయిందని కావ్యని అందరు అవమానించడంతో.. పోయిన పరువు తిరిగి తెస్తానని కావ్య మళ్ళీ ప్రెస్ మీట్ పెడుతుంది. మీడియా వాళ్ళందరికి కావ్య ఎందుకు ప్రెస్ మీట్ పెట్టిందో అర్థం కాదు.
ఆ తర్వాత అందరూ హాల్లో కూర్చొని ఉండగా.. కళ్యాణ్ వచ్చి కావ్య ప్రెస్ మీట్ లో లైవ్ లో మాట్లాడేది పెడతాడు. కావ్య ప్రెస్ వాళ్ళతో మీకు నిజానిజాలు తెలియకుండా మా ఇంటి పరువు తీసేలా రాసే అధికారం మీకు ఎవరిచ్చారని కావ్య మీడియా వాళ్ళని అడుగుతుంది. అంటే మీరు చేసింది నిజం కాదంటారా అని ప్రెస్ వాళ్ళు అడుగుతారు. నేను చేసింది నిజమే కానీ అది నా పుట్టింటి వాళ్ళ కోసం చేసింది. నాకేదో కష్టం వచ్చి నా కోసం అయితే కాదు. మీరు రాసినట్టు నన్ను నా అత్తింటి వాళ్ళు బాగా చూసుకోవడం లేదు అని రాసారు కదా అది అబద్ధం.. నన్ను దుగ్గిరాల కుటుంబం బాగా చూసుకుంటుంది. నన్ను ఎవరో బలవంతం చేస్తే నేను ఇక్కడికి వచ్చి మాట్లాడడం లేదని కావ్య ప్రెస్ వాళ్ళతో చెప్పి వెళ్ళిపోతుంది..ఆ తర్వాత కావ్య ప్రెస్ వాళ్లతో మాట్లాడిన తర్వాత రుద్రాణి కావాలనే అపర్ణ దృష్టిలో కావ్యని చెడు చెయ్యాలని చూస్తుంది. వాళ్ళ పుట్టింటికి వెళ్లి పని చేస్తున్న విషయం ఒక్క మనకే తెలుసు ఇప్పుడు దీంతో అందరికి తెలిసిపోతుందటూ రుద్రాణి మాట్లాడుతుంది. కావ్య కరెక్ట్ చేసింది. పరువు పోయిందని అన్నారు కాబట్టి మీడియా వాళ్లని పిలిచి మాట్లాడి పోయిన పరువు తీసుకొచ్చిందని ధాన్యలక్ష్మి అంటుంది. ఇలా మనకు తెలియకుండా పిచ్చి పని చేస్తుంది అనుకోలేదని సుభాష్ అంటాడు. కావ్య ఆత్మగౌరవం అంటూ మన మాట వినేలా లేదు. వెళ్లి వాళ్ళ అమ్మనాన్నలతో ఈ పని చెయ్యకని చెప్పించాలని, అప్పుడే ఈ సమస్యకి పరిష్కారమని ఇందిరాదేవి అంటుంది.
మరొక వైపు రాజ్ కి కావ్య పెట్టిన ప్రెస్ మీట్ గురించి తెలుస్తుంది. కోపంగా మీటింగ్ నుండి బయటకు వస్తాడు రాజ్. అప్పుడే రాహుల్ వచ్చి రాజ్ నీ రెచ్చగొడతాడు. ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేస్తే ఎలాగైనా తనకి నువ్వు జాబ్ ఇవ్వాలనుకుంటున్నావ్ కదా అంటూ కావ్యపై కోపం వచ్చేలా రాహుల్ మాట్లాడతాడు. మరొక వైపు కనకం ఇంటికి అపర్ణ వెళ్లి.. కావ్య మీ ఇంటికి వచ్చి పని చెయ్యడానికి మీరెలా ఒప్పుకున్నారని కనకం, కృష్ణమూర్తిలపై అపర్ణ కోప్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.