English | Telugu
విశ్వనాథ్ కి అలా జరిగిందని ఏంజిల్ కి తోడుగా వసుధార!
Updated : Aug 12, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -839 లో.. విశ్వనాథ్ గురించి ఏంజిల్ చెప్తూ ఎమోషనల్ అవుతుంది. నువ్వు బాధపడుతుంటే సర్ కూడా భాధపడతారని ఏంజిల్ కి ధైర్యం చెప్తాడు రిషి. అప్పుడే ఏంజిల్ కి వసుధార ఫోన్ చేస్తుంది. నువ్వు లిఫ్ట్ చేసి మాట్లాడు, నేను తాతయ్యకి జ్యూస్ ఇచ్చి వస్తానని రిషికి చెప్పేసి ఏంజిల్ వెళ్తుంది. వసుధార ఫోన్ చూసి రిషి లిఫ్ట్ చేయడు.
మరొక వైపు వసుధార క్లాస్ చెప్తూ.. రిషి సర్ ఈ రోజు ఎందుకు రాలేదు. మళ్ళీ ఏమైనా ప్రాబ్లమా? ఏంజెల్ కూడా ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదంటూ ఆలోచిస్తు బయటకు వస్తుంది. అప్పుడే రిషి ఎదురుగా వస్తాడు. ఎందుకు లేట్ అయిందని వసుధార అడిగితే చెప్పడని వసుధార అనుకుంటుంది. విశ్వనాథ్ సర్ కి అలా జరిగిందని చెప్పాలా, వసుధారా మేడమ్ నీ ఏంజిల్ కి తోడుగా ఉండమని చెప్పాలా అని రిషి అనుకుంటాడు. కానీ రిషి అవేం అనకుండా సెమిస్టర్ పేపర్ రెడీ చెయ్యండని చెప్పి వెళ్ళిపోతాడు. మరొక వైపు వసుధారకి ఏంజిల్ ఫోన్ చేస్తుంది. నువ్వు చేసావ్ కానీ లిఫ్ట్ చెయ్యలేదు. తాతయ్యకి ఇలా జరిగిందని చెప్తుంది. ఇప్పుడు ఎలా ఉన్నారని వసుధార అడుగుతుంది. నేను వస్తానని వసుధార అనగా.. ఇప్పుడు వద్దు తాతయ్య బానే ఉన్నాడు. రిషి తో రా అని ఏంజిల్ చెప్తుంది..ఆ తర్వాత రిషి సర్ నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదని వసుధార అనుకుంటుంది. వసుధార చక్రపాణికి ఫోన్ చేసి విశ్వనాథ్ కి అలా జరిగిన విషయం చెప్పి, సాయంత్రం నేను ఒకసారి వెళ్లి చూసి వస్తానని వసుధార చెప్తుంది. ఆ తర్వాత రిషికి ఏంజిల్ కాల్ చేసి.. తాతయ్యని చూడడానికి వసుధార వస్తుంది.. నువ్వు వచ్చేటప్పుడు తనని తీసుకొని రమ్మని ఏంజెల్ చెప్తుంది. ఆ తర్వాత రిషి బయలుదేరి వసుధార దగ్గర కార్ ఆపుతాడు. సర్ ఎక్కమని అనకుండా, ఎక్కనని వసుధార అనుకుంటుంది. ఆ తర్వాత వసుధారని రిషి కార్ ఎక్కమని అనగా.. సరేనని వసుధార కార్ ఎక్కుతుంది.
ఆ తర్వాత కార్ లో ఇద్దరు వెళ్తుంటే.. మీరు ఏంజిల్ కి కొంచెం దైర్యం చెప్పండి, బయపడుతుందని రిషి చెప్తాడు. మీరు ఇన్‌స్పెక్టర్ కి కాల్ చేశారా? రౌడీల గురించి ఏమైనా తెలిసిందా అని వసుధార అడుగుతుంది. చేశాననని రిషి చెప్తాడు. ఆ తర్వాత వసుధార, రిషి ఇద్దరు ఇంటికి వెళ్తారు. విశ్వనాథ్ దగ్గరికి వెళ్లి ఆరోగ్యం ఎలా ఉందోనని కనుక్కుంటుంది. ఏంజిల్ ఎమోషనల్ అవుతు.. నువ్వు నాతో పాటు ఇక్కడే ఉండమని వసుధారతో ఏంజిల్ అంటుంది. సరే అని వసుధార అంటుంది. ఈ కాఫీ తీసుకొని వెళ్లి రిషికి ఇవ్వమని ఏంజిల్ అంటుంది. వసుధార ఇబ్బందిగానే కాఫీ తీసుకొని రిషి దగ్గరికి వెళ్తుంది. మీరు ఎందుకు వచ్చారు.. కాఫీ ఇచ్చారు కదా వెళ్ళండని వసుధారతో రిషి అంటాడు. మీరు ఒకసారి మహేంద్ర సర్ కి కాల్ చెయ్యండని వసుధార అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.