English | Telugu

తనే యాక్సిడెంట్ చేపించిందని నమ్మేసారు.. ఇదేం ట్విస్ట్ రా మామ!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -299 లో.. ముకుంద తను చేసిన తప్పుని కృష్ణ మీదకి నెట్టేస్తుంది. కృష్ణని మీరు ఇంట్లో నుండి పంపించేసారన్న కోపంతో వాళ్ళ చిన్నాన్నతో కలిసి మురారికి ఆక్సిడెంట్ చేశారని తన గురించి నెగెటివ్ గా ముకుంద చెప్తుంది.

ఆ తర్వాత మురారి మొహం పాడవడంతో తన హాస్పిటల్ లోనే ప్లాస్టిక్ సర్జరి చేసి వాళ్ళతో తీసుకొని వెళ్ళాలని అనుకుంటుందని ముకుంద చెప్పగానే.. కృష్ణ అలా చెయ్యదని రేవతి అంటుంది. అబద్ధాలు చెప్పే అవసరం నాకు లేదని ముకుంద అంటుంది. తర్వాత అందరు కలిసి హాస్పిటల్ కి వెళ్తారు. మరొకవైపు ప్రభాకర్, శకుంతల పరిమళతో మాట్లాడతారు. వాళ్ళకి అతనే మురారి అని తెలుస్తుంది.. ఆ తర్వాత మురారిని తమతో తీసుకొని వెళ్ళాలని ప్రభాకర్ అంటాడు. మరొక వైపు అందరు హాస్పిటల్ కీ వస్తారు. అప్పుడే కృష్ణ, మురారి, శకుంతల వస్తుంటారు. రూపం మారిన మురారిని చుసి రేవతి ఎమోషనల్ అవుతుంది. రేవతిని అమ్మ అని మురారి పిలుస్తాడు. మురారి ఎవరిని గుర్తుపట్టడు. రేవతి నువ్వు మురారిని తీసుకొని వెళ్ళు అని భవాని చెప్పగానే.. రేవతి తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత కృష్ణ ఏదో చెప్పబోతుంటే భవాని కృష్ణ చెంప చెళ్లుమనిపిస్తుంది. ఇంత నమ్మక ద్రోహం చేస్తావా అంటూ కృష్ణతో పాటు వాళ్ళ చిన్నన్న, చిన్నమ్మలని భవాని తిడుతుంది.

ఆ తర్వాత ముకుంద కూడా అంత కృష్ణ వల్లే అంటూ మాట్లాడేసరికి కృష్ణకి కోపం వచ్చి ముకుంద పైకి ఫైర్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఇలా కాదు మిమ్మల్ని పోలీస్ లకీ పట్టిస్తానని కృష్ణతో భవాని చెప్తుంది. మరొక వైపు మురారి సిచువేషన్ చూసి రేవతి బాధపడుతుంది. ఏంటి భవాని అక్క ఇంకా రావడం లేదని అనుకుంటుంది. కాసేపటికి పోలీసులు భవాని దగ్గరికి వస్తారు. తనని అరెస్ట్ చెయ్యండని భవాని చెప్తుంది.. అప్పుడే ప్రభాకర్ ఆపండి అంటూ వస్తాడు. ఇన్‌స్పెక్టర్ గారు భవాని అక్క చెప్పింది నిజమే అనగానే అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.