English | Telugu

'ఆహా' మరో ట్విస్ట్.. బన్నీ 'అన్ స్టాపబుల్'కి బ్రేక్!

నటసింహం నందమూరి బాలకృష్ణ ఓటీటీ వేదిక ఆహాలో హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షో ఆరో ఎపిసోడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 నుండి ప్రసారం కానుందని ఇటీవల ఆహా ప్రకటించింది. అయితే తాజాగా ఈ ఎపిసోడ్ ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చింది ఆహా.

నిజానికి ఆరో ఎపిసోడ్ గా మాస్ మహారాజ రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని పాల్గొన్న ఎపిసోడ్ రానుందని మొదట ఆహా ప్రకటించింది. అయితే ఈ డిసెంబర్ 31 కి వాయిదా వేసి, ఆ ప్లేస్ లో బన్నీ ఎపిసోడ్ ని తీసుకొచ్చారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ 'పుష్ప ది రైజ్'తో బన్నీ డిసెంబర్ 17 ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే బన్నీ ఎపిసోడ్ ని ముందుకి తీసుకొచ్చి రవితేజ ఎపిసోడ్ ని పోస్ట్ పోన్ చేసినట్లు టాక్ వినిపించింది.

అయితే తాజాగా బన్నీ ఎపిసోడ్ ని కూడా పోస్ట్ పోన్ చేసి షాక్ ఇచ్చింది ఆహా. ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పుష్ప ఎపిసోడ్ ని కొన్ని అనివార్య కారణాల వల్ల రేపు(డిసెంబర్ 25) విడుదల చేయలేకపోతున్నామని ఆహా తెలిపింది. కాస్త ఆలస్యమైనా బెస్ట్ అవుట్ పుట్ తో వస్తామని చెప్పింది. చిన్న బ్రేక్ అంతే, అన్ స్టాపబుల్ ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ అవుతుంది అని ఆహా పేర్కొంది.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.