English | Telugu
`ఢీ` షో భామ దీపిక పిల్లికి ఊహించని షాక్
Updated : Dec 25, 2021
టిక్ టాక్ తో పాపులర్ అయిన సోయగం దీపిక పిల్లి. టిక్ టాక్ బ్యాన్ కావడంతో కొంత నిరుత్సాహానికి గురైన దీపిక పిల్లికి పాపులర్ డ్యాన్స్ షో `ఢీ`లో చోటు దక్కిన విషయం తెలిసిందే. ఆ తరువాత `శ్రీదేవి డ్రామా సెంటర్`లోనూ అప్పుడప్పుడు మెరుస్తోంది దీపిక.
టిక్ టాక్‌లో ఫేమస్ అయిన దీపిక ఆ తరువాత `ఢీ` షో దీపికగా మారింది. ఇదే షోలో ఆకట్టుకుంటూ తన అందంతో ఆడియన్స్‌ని ఫిదా చేస్తోంది. ఇప్పటికే ఈ షో ద్వారా భారీ స్థాయిలో అభిమానుల్ని సొంతం చేసుకుంది. వర్షిణి తరువాత ఆ స్థానంలోకి ఎంట్రీ ఇచ్చి అందరికి షాకిచ్చింది.
దీపిక అందాన్ని అవకాశంగా తీసుకుని తనకు, హైపర్ ఆదీలకు మధ్య లవ్ ట్రాక్ ని నడిపించాలని, తద్వారా షోకు మరింత పాపులారిటీని తీసుకురావాలని ప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ వర్కవుట్ కాలేదు. మల్లెమాల టీం ఎంతగా ట్రై చేసినా హైపర్ ఆది, దీపిక పిల్లి కెమిస్ట్రీ కుదరలేదు. దీంతో ఈ జోడీ ఫెయిలైపోయింది. దీంతో దీపిక చేతిలో వున్న ఈ ఒక్క షో కూడా పోయింది. టిక్ టాక్ లో 10 మిలియన్ ఫాలోవర్స్ ని సొంతం చేసుకరుని మాయచేసిన దీపిక పిల్లి మళ్లీ అదే బాటలోకి వెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీపిక పిల్లి చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. తన సోయగాలతో నెటిజన్ లకి వల వేస్తూ ఆకట్టుకుంటోంది.
వరుస ఫొటో షూట్‌లతో కవ్విస్తూ ఎంటర్‌టైన్ చేస్తోంది. రష్మితో దీపిక బాండింగ్ బాగా కుదిరినా హైపర్ ఆదితో సెట్టవ్వకపోవడంతో దీపిక ఢీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయినా సరే నెట్టింట తన క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. అదే జోరుని కొనసాగిస్తోంది. అయితే తాజాగా ఆమె చేసిన ఓ తమాషా పని దీపికనే షాక్ కు గురయ్యేలా చేసింది. నీకు ఏ వయసులో పెళ్లి అవుతుంది? అని ఓ ప్రశ్న దీపిక పిల్లికి ఎదురైంది. ఆ ప్రశ్నకు ఇన్‌స్టా గ్రామ్ లోని యాప్ లు రకరకాలు సమాధానాలు చెప్పాయి. చివిరికి నీకు ఎప్పటికీ పెళ్లి కాదు అని సమాధానం రావడంతో దీపిక షాక్ కు గురవుతోందట. ఇది చూసి నెటిజన్ లు దీపికపై సెటైర్లు వేస్తున్నారు. నీకు పెళ్లి కాకపోతే నా పరిస్థితి ఏంటీ? అని చిలిపిగా స్పందిస్తుండటం నవ్వులు పూయిస్తోంది.