English | Telugu

నలుగురికి సాయం చేయడం కోసం ముందుకొచ్చిన పల్లవి ప్రశాంత్!

ఒక వేయి కాదు రెండు వేలు కాదు లక్ష రూపాయలు లేనివాళ్ళకోసమిచ్చాడు పల్లవి ప్రశాంత్. దీని గురించి తన ఇన్ స్టాగ్రామ్ లో పల్లవి ప్రశాంత్ పోస్ట్ చేయగా.. అది ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. నలుగురికి సాయం చేయడం కోసం పల్లవి ప్రశాంత్ తో పాటు ఆట సందీప్, భోలే షావలి, శివాజీ ముందుకొచ్చారు. ఓ కుటుంబానికి లక్ష రూపాయలు ఇచ్చిన పల్లవి ప్రశాంత్.. వారికి సంవత్సరానికి సరిపడా రైస్, ఫుడ్ అన్నీ చూసుకుంటు‌న్నానని చెప్పినట్టుగా ఆట సందీప్ చెప్పుకొచ్చాడు ‌. ఇలా ఇంకా లేనివారికి సాయం చేస్తూనే ఉంటానని మరిన్ని వీడియోలు చేస్తానని.. ప్రాణం పోయిన మాట తప్పను అని పల్లవి ప్రశాంత్ ఈ పోస్ట్ లో చెప్పుకొచ్చాడు.

ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు రైతు మాట ఇచ్చాడంటే చేసి చూపిస్తాడురా అని అంటున్నారు. సెల్యుట్ టూ ప్రశాంత్ అని ఒకరు, ఇది సామాన్యుడి విజయమని మరొకరు ఇలా ఇన్ స్టాగ్రామ్ మొత్తం ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాడు పల్లవి ప్రశాంత్‌. ఇది కదా రైతు కథ.. ఇదే కదా రైతు కల.. సామాన్యుడిగా మొదలైన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ ప్రయాణం.. ఎంతోమంది రైతులకి స్పూర్తినిచ్చింది. ఎక్కడో పొలంలో పనిచేసుకునే రైతు.. ఓ సెలెబ్రిటీ హోదాని దక్కించుకున్నాడు. ఓ ఇరవై మంది సెలబ్రిటీలున్న రియాలిటీ షోలో వారందరిని కాదని గెలుపుని సొంతం చేసుకున్న రైతుబిడ్డగా చరిత్ర సృష్ణించాడు పల్లవి ప్రశాంత్.

బిగ్ బాస్ సీజన్-7 మొదటి వారం నుండి చివరి వరకు ఆటల్లో మెరుపు వేగంతో దూసుకుపోతూ తగ్గేదేలే అన్న రైతుబిడ్డ ‌పల్లవి ప్రశాంత్ కి విశేష ఆదరణ లభించింది. బిగ్ బాస్ సీజన్-5 కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ నుండి అరియాన వరకు దాదాపు అందరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రైతుబిడ్డకి సపోర్ట్ చేశారు. దీనికి కారణం లేకపోలేదు. హౌస్ లోకి ఎంటర్ అయ్యాక ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు ప్రశాంత్. సీరియల్ బ్యాచ్ అతడిని తక్కువ చేసి చూశారు. అయితే హౌస్ లోని ప్రతీ ఆటలో వందకి వంద శాతం ఎఫర్ట్ పెట్టి తనేంటో నిరూపించుకున్నాడు ప్రశాంత్. చివరివరకు తగ్గేదేలా అంటు రెచ్చిపోయాడు. సెలెబ్రిటీలందరిని దాటేసి రైతుబిడ్డ సత్తా చాటుకున్నాడు. పల్లవి ప్రశాంత్ ని హౌస్ లోకి వెళ్ళనంతవరకు ఎంతోమంది ఎగతాళి చేశారు. వారందరికి తన గెలుపుతో‌ సమాధానం చెప్పాడు.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.