English | Telugu
పల్లవి ప్రశాంత్ కు మీ సపోర్ట్ అవసరం:ప్రిన్స్ యావర్!
Updated : Dec 21, 2023
ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 ప్రిన్స్ యావర్ అంటే అందరికి సుపరిచితమే. మోడల్ గా కొన్ని సీరియల్స్ లో చేసిన నటుడిగా కొంతమందికే తెలుసు. కానీ బిగ్ బాస్ సీజన్-7 లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చాకే ఈయన గురించి అందరికి తెలిసింది. ఇప్పుడు బయట ఎక్కడ కనిపించిన.. అందరు బిగ్ బాస్ యావర్ అని గుర్తుపడతారు. మొదట కండలవీరుడిగా గుర్తింపు తెచ్చుకోగా మెల్లి మెల్లగా శివాజీ చెంత చేరి కొన్ని మెళుకువలు నేర్చుకున్నాడు యావర్. మొదట యావర్ హౌస్ లో ఎవరు రెచ్చగొట్టిన వారి మీదకి చాలా అగ్రెసివ్ గా దూకుడుగా వెళ్ళేవాడు కానీ ఎప్పుడైతో శివాజీతో స్నేహం చేశాడో అంతా మారిపోయాడు. కీప్ కాప్ అండ్ కూల్ అన్నట్టుగా యావర్ సాధారణంగా ఉన్నాడు.
బిగ్‌బాస్ హౌస్ లో కంటెస్టెంట్ లాంటి ఒక అమూల్యమైన అవకాశం అంత ఈజీగా ఎవరికి రాదు. సాధారణంగా తెలుగు షోలలో ఎవరైన కొత్తవారు పాల్గొంటున్నారంటే ఎవరైనా సరే కచ్చితంగా తెలుగులోనే మాట్లాడాలి. బిగ్‌బాస్ షోలో అయితే ఇది మరీ పక్కాగా ఉండాలి. కానీ యావర్ విషయంలో నిర్వహకులు చాలాసార్లు దీన్ని పక్కనపెట్టేశారు. ఇక మనోడు శివాజీ బ్యాచ్‌లోకి చేరిపోయేసరికి.. ఎలిమినేషన్ నుంచి ప్రతిసారి సేవ్ అవుతూ వచ్చాడు. అలా ఫినాలే వీక్‌లోకి కూడా అడుగు పెట్టేశాడు. అయితే టాప్-6లో ఉన్న వాళ్లలో యావర్ కప్ కొట్టే ఛాన్స్ లేదు. దీంతో రూ.15 లక్షల సూట్‌కేస్ తీసుకుని ఫినాలే ఎపిసోడ్‌లో తనకు తానే ఎలిమినేట్ అయిపోయాడు యావర్.
అయితే గత నాలుగు రోజుల నుండి పల్లవి ప్రశాంత్ మీద కేసులు నమోదయ్యాయని, అతడి కోసం పోలీసులు గాళింపు చర్యలు అంటు వార్తలు రాగా మొన్న ఛంచల్ గూడ జైలుకి తీసుకెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంట. కోర్ట్ ప్రశాంత్ కి పద్నాలుగు రోజులు రిమాండ్ ను విధించింది. అయితే అతనికి బెయిల్ ఇవ్వడానికి పాటబిడ్డ భోలే షావలి రంగంలోకి దిగాడు. మోస్ట్ ఎమోషనల్ గా మాట్లాడాడు. కాగా ఇది వైరల్ అయింది. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కి యావర్ తన సపోర్ట్ ఇచ్చాడు. పల్లవి ప్రశాంత్ నాకు మంచి స్నేహితుడు. హౌస్ లో చూసాను వాడు చాలా మంచివాడు. అతడి తప్పు లేదు. దయచేసి అతనికి అభిమానులు సపోర్ట్ చేయండి. త్వరగా బయటకు రావాలని ప్రిన్స్ యావర్ తన సపోర్ట్ ని పల్లవి ప్రశాంత్ కి తెలిపాడు. నా ఫ్యాన్స్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్, శివాజీ అన్న ఫ్యాన్స్, స్పై ఫ్యాన్స్ ప్రశాంత్ కి సపోర్ట్ చేయండి అంటు యావర్ ఈ వీడియోలో తెలిపాడు. మరి ప్రశాంత్ కు బెయిల్ లభిస్తుందా? లభిస్తే ఎన్ని రోజుల్లో బయటకు వస్తాడో తెలియాలి.