English | Telugu
రైతుబిడ్డ కోసం కన్నీళ్లు పెట్టుకున్న పాటబిడ్డ.. పాపం వాడికేం తెలియదు!
Updated : Dec 21, 2023
బిగ్ బాస్ హౌస్ లో అటు రైతు బిడ్డ కప్పు గెలిచి అందరిని ఆకట్టుకోగా, ఇటు పాట బిడ్డగా అడుగుపెట్టిన భోలే షావలి తన పాటలతో తెలుగు రాష్ట్రాల ప్రజలని ఎంటర్ టైన్ చేశాడు. 2.0 లో అశ్వినిశ్రీ, పూజామూర్తి, నయని పావని, అంబటి అర్జున్ లతో పాటు పాట బిడ్డగా భోలే షావలి ఎంట్రీ ఇచ్చాడు. ఇక హౌస్ లో పల్లవి ప్రశాంత్, శివాజీ, యావర్ లతో ఎక్కువగా కన్పించిన భోలే తన సపోర్ట్ ని స్పై బ్యాచ్ కి ఇచ్చాడు. హౌస్ లో తన మాటతీరుతో, ఆటతీరుతో పంచులతో ఎంతో ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చాడు భోలే.
బిగ్ బాస్ హౌస్ లో భోలే పాడిన అమ్మ పాట ఎంతో మంది ప్రేక్షకుల హృదయాలని కరిగించింది. నాగార్జున సైతం అతని పాటని ఆస్వాదిస్తూ ప్రతీ వీకెండ్ ఓ పాటని కూడా పాడమనేవాడు. సీరియల్ బ్యాచ్ తో నామినేషన్ లో అతని డిఫెడింగ్ చూసి ఇన్ స్టాగ్రామ్ లో ఫ్యాన్ పేజీలు పుట్టుకొచ్చాయి. సీరియల్ బ్యాచ్ తో గొడవల్లో భోలే షావలి మాస్ పంచ్ లకి క్లాస్ పీపుల్స్ కూడా క్లాప్స్ కొట్టారు. బిగ్ బాస్ షో మీద అతను లిరిక్స్ రాసి పాడిన ఆ పాట ఎంతో ఫేమస్ అయింది. ఇప్పుడు భోలే అంటే హీరో అంటూ మరో కొత్త పాటతో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్నాడు. కాగా ఇప్పుడు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ని అలా కావాలని అన్నీ ప్లాన్ చేసి ఇలా ఇరికించారంటూ ఎమోషనల్ అయ్యాడు భోలే.
మీడియా వాళ్లతో పల్లవి ప్రశాంత్ ఏమైనా మిస్టేక్‌గా ప్రవర్తించి ఉంటే నా తరఫున సారీ చెబుతున్నా.. అతనికేం తెలీదండి.. అతను మట్టి బిడ్డ.. పోరాటం చేసి గెలిచాడు.. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతుబిడ్డగా ఇంత సాధించాడు. హౌస్‌లో ఆటాడేటప్పుడు నాకు తెలుసు.. ఎన్నో దెబ్బలు తాకించుకున్నాడు.. రొమ్ము మీద దెబ్బ తగిలితే "అన్నా ఇక్కడ నొస్తంది నాకేమైనా అయితదా" అని అడిగాడు.. అంటే లేదు తమ్ముడు నువ్వు జనం కోసం ఆడాలి.. నీకోసం ఎదురుచూస్తుర్రు జనం.. అని చెప్పేవాడిని. నేను వైల్డ్ కార్డ్ ద్వారా వెళ్లాను.. "తమ్ముడు నీకు మంచి పేరుంది.. నువ్వు ఆడాలి.. నువ్వు గెలవాలి.. నేను నీకోసం పాట పాడటానికి వచ్చినా అని చెప్పాను.. నేను లేకున్నా ఫర్లేదు తమ్ముడు.. నేను పాటతోటి బతుకుతా బయట.. కానీ నువ్వు ఆటతోనే బతకాలి బయటికొచ్చి అని నేను అన్నా.." అంటూ భోలే చెప్పుకొచ్చారు.
నిన్న అశ్వినిశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. " పాపం అండి వాడికేం తెలియదు. ఎవరో ఏమో చేస్తే ప్రశాంత్ ని ఎందుకు అరెస్ట్ చేశారు. విన్ అయి కనీసం రెండు రోజులు కూడా కాలేదు. వాడికి విన్ అయిన సంతోషం కూడా లేకుండా చేశారు" అంటూ చెప్పింది. ఇలా పల్లవి ప్రశాంత్ ఏం తప్పు చేశాడంటూ అశ్వినిశ్రీ, భోలే షావలి, ఆటసందీప్ అతడి భార్య ఇన్ స్టాగ్రామ్ లలో పోస్ట్ లు చేస్తున్నారు. కాగా ఇప్పుడు భోలే చెప్పిన మాటలకు ఫ్యాన్స్ తమ మద్దతు తెలుపుతూ కామెంట్లు చేస్తున్నారు. రైతుబిడ్డ కోసం పాటబిడ్డ పెట్టిన కన్నీళ్ళకు బిగ్ బాస్ ప్రేక్షకులు స్పందిస్తూ పోస్ట్ లు చేస్తున్నారు. కాగా ఇది ఫుల్ వైరల్ గా మారింది.