English | Telugu
'అన్‌స్టాపబుల్' క్రేజ్.. ప్రభాస్ ఎపిసోడ్ గ్లింప్స్‌కి సూపర్ రెస్పాన్స్!
Updated : Dec 14, 2022
అభిమాన హీరో సినిమా గ్లింప్స్, టీజర్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూడటం సహజం. అయితే ఒక ఓటీటీ షో ఎపిసోడ్ గ్లింప్స్, ప్రోమో కోసం ప్రేక్షకులంతా ఎదురు చూడటం ఆశ్చర్యం కలిగించే విషయం. తాజాగా అది 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' షోకి సంబంధించిన ఒక ఎపిసోడ్ విషయంలో జరిగింది.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' షోకి రెబల్ స్టార్ ప్రభాస్ హాజరయ్యాడు. త్వరలో ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్ కి సంబంధించిన గ్లింప్స్ తాజాగా విడుదలైంది. ఈ గ్లింప్స్ కోసం కేవలం ప్రభాస్ అభిమానులే కాకుండా అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ట్విట్టర్ లో సైతం ఇది ట్రెండింగ్ గా మారింది.
'బాహుబలి మీట్స్ బాలయ్య' అంటూ విడుదల చేసిన గ్లింప్స్ లో ప్రభాస్ లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. "రేయ్ ఏం చెప్తున్నావ్ డార్లింగ్" అంటూ ప్రభాస్ సరదాగా మాట్లాడిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ఎపిసోడ్ లో ప్రభాస్ తో పాటు గోపీచంద్ కూడా సందడి చేయనుండగా.. రామ్ చరణ్ వీడియో కాల్ ద్వారా సర్ ప్రైజ్ ఎంట్రీ ఇస్తాడని సమాచారం. "ప్రభాస్ ఓ న్యూస్ చెప్తాడు" అంటూ చరణ్ వీడియో కాల్ లో అనడంతో.. "ఏం చెప్తున్నావ్ డార్లింగ్" అని ప్రభాస్ రియాక్ట్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ కానుంది.