English | Telugu

కామన్ మ్యాన్ ఆదిరెడ్డి జర్నీ సాగిందిలా!

బిగ్ బాస్ ప్రతీ సీజన్లోనూ కామన్ మ్యాన్ కి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ సారి కామన్ మ్యాన్ గా ఆదిరెడ్డి హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు కామన్ మ్యాన్ కోటాలో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన ఏ కంటెస్టెంట్ కూడా ఇన్ని వారాలు హౌస్ లో లేరు. అయితే ఫినాలేకి వచ్చిన తొలి కామన్ మ్యాన్ గా ఆదిరెడ్డి ఇప్పుడు హౌస్ లో ఉన్నాడు.

ఆదిరెడ్డి జర్నీ సాగిందిలా.. ఒక కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఏ బ్యాక్ గ్రౌండ్ లేదు. నాగార్జున సైతం ప్రతీ వీకెండ్ లో అతడిని డ్యాన్స్ చేయమని చెప్తూ ప్రోత్సహించేవాడు. తనకు వచ్చి రాని డ్యాన్స్ తో హౌస్ లో నవ్వులు పూయించాడు. మొదటి నుండి గీతూతో కలిసి ఉండేవాడు. గీతక్క గీతక్క అంటూ ఎప్పుడూ కలిసి తిరిగేవాడు. గీతు ఎలిమినేట్ అయ్యాక ఒంటరివాడయ్యాడు. ఆ తర్వాత జరిగిన టాస్క్ లలో హౌస్ మేట్స్ కి మెల్లి మెల్లిగా దగ్గర అయ్యాడు. ఫ్యామిలీ వీక్ లో తన పాప, భార్య రావడంతో ఆ ఎపిసోడ్‌ మొత్తం 'ఆదిరెడ్డి కామన్ మ్యాన్ షో' గా మారిందనే చెప్పాలి.

ఆ తర్వాత ఆదిరెడ్డికి ఫ్యాన్ బేస్ అమాంతం పెరిగింది. "ప్రేక్షకులు ఏ స్థానం ఇచ్చినా నేను స్వీకరిస్తాను. మీరు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. ఏ పొజిషన్ ఇచ్చినా మీకు ఋణపడి ఉంటా బిగ్ బాస్.. నా లైఫ్ మార్చింది బిగ్ బాస్. నా వంద శాతం ఇచ్చి, ఫైనలిస్ట్ లో ఉన్నాను బిగ్ బాస్. లవ్ యూ కవిత.. నీ సపోర్ట్ లేకుంటే నేను బిగ్ బాస్ కి వచ్చేవాడిని కాదు. ఈ ఆనందం ఎంతలా ఉందంటే.. ఇదే ఆనందం ఒక రెండు, మూడు నెలలు ఉంటే లైఫ్ టైమ్ బ్రతుకుతా బిగ్ బాస్" అని ఆదిరెడ్డి చెప్పుకొచ్చాడు.