English | Telugu
మా తల్లి అంటూ ఢీ స్టేజ్ ని ముద్దాడిన శేఖర్ మాస్టర్!
Updated : Dec 14, 2022
బుల్లితెరపై ఢీ షోకు ఉన్న క్రేజ్ అందరికీ తెలిసిందే. మల్లెమాల నుంచి వచ్చిన ఈ ప్రొడక్ట్ ఇప్పటికీ హై స్పీడులో దూసుకుపోతోంది. ఇప్పటివరకు 14 సీజన్స్‌ను కంప్లీట్ చేసుకొని ఇటీవలే ఢీ 15వ సీజన్‌లోకి అడుగు పెట్టింది. ఢీ 15 లాంచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ప్రభుదేవా అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. కాగా ఢీ 15కి సంబంధించిన సెకండ్ ప్రోమోను తాజాగా రిలీజ్ చేసింది మల్లెమాల. ఈ ప్రోమోలో డ్యాన్స్ మాస్టర్ శేఖర్ మాస్టర్ కనిపించేసరికి ఢీ ప్రేమికులు మరియు ప్రేక్షకులు షాక్‌కి గురయ్యారు.
అసలు విషయం ఏమిటంటే... ఇటీవలే శేఖర్ మాస్టర్ ఢీకి గుడ్ బై చెప్పి వేరే ఛానల్‌లో ప్రసారమవుతున్న మరో ప్రోగ్రామ్‌కి జడ్జిగా వ్యవహరించారు. మరలా తిరిగి ఢీ షోకి జడ్జ్‌గా రీ ఎంట్రీ ఇచ్చేశారు. హీరోయిన్ శ్రద్దాదాస్‌తో కలిసి అదిరిపోయే డ్యాన్స్‌తో ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ... మేము కొన్ని కమిట్ మెంట్స్ వల్ల అలా వెళ్లి ఇలా వస్తాము తప్ప.. మా తల్లి మాత్రం ఈ తల్లే అంటూ ఢీ స్టేజ్‌ని ముద్దుపెట్టుకున్నాడు.
ఇక ఈ ఢీ షో విషయానికి వస్తే... ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా, ఎంతగా ట్రోలింగ్ జరిగినా, ఢీ అనేది డ్యాన్స్ షో కాదు.. కామెడీ షో అయిందంటూ నెగెటివ్ కామెంట్లు వచ్చినా కూడా టీఆర్పీ రేటింగ్ మాత్రం ఈ షోకి బాగానే వస్తుంది. ఇక ఈ ఢీ 15కి ప్రదీప్ హోస్ట్‌గా కంటిన్యూ అవుతున్నాడు. ఆది టీమ్ మెంటర్‌గా కనిపించబోతున్న ఈ షోలో శేఖర్ మాస్టర్‌తో పాటు హీరోయిన్ శ్రద్దాదాస్ మరో జడ్జిగా వ్యవహరిస్తున్నారు.