English | Telugu
డాక్టర్ ని చేద్దామనుకున్నారు నేను యాక్టర్ ని అయ్యాను
Updated : Nov 15, 2022
ఆలీతో సరదాగా షో ప్రతీ వారం ఫుల్ కామెడీతో ఎంటర్టైన్మెంట్ ఓరియెంటెడ్ గా సాగిపోతోంది. ఇక ఇప్పుడు ఈ షోకే గెస్టులుగా తులసి, ప్రభాస్ శీను వచ్చారు. ప్రభాస్ శీను తనకు సంబంధించి ఎన్నో విషయాలను ఈ షోలో చెప్పాడు. "మా నాన్న శరత్ బాబు గారు ఇద్దరూ ఫ్రెండ్స్..మా నాన్న డాక్టర్ అవుదామనుకున్నారు. ఆర్ధిక స్తొమత లేక అవలేదు. నన్ను డాక్టర్ చేద్దామనుకున్నారు. నేను అవలేదు. అసలు నాకు ఇంటరెస్ట్ లేదు. తర్వాత శరత్ బాబు గారు ఫిలిం ఇన్స్టిట్యూట్ కి పంపించామని చెప్పేసరికి మా నాన్న పంపించారు. అలా కొంచెం ఇంటరెస్ట్ వచ్చింది. ప్రభాస్ గారి దగ్గర అవకాశం ఎలా వచ్చింది అంటే నేను సత్యానంద్ గారి ఇన్స్టిట్యూట్ లో చేరినప్పుడు ప్రభాస్ కూడా అక్కడే జాయిన్ అయ్యారు.
ఆయనకు మేమంతా కో-ఆర్టిస్టుల్లా ఉండేవాళ్ళం." అని చెప్పాడు ప్రభాస్ శీను. "ఇంటర్ ఫెయిల్, పాలిటెక్నిక్ ఫెయిల్ అన్ని ఫట్టే. చదువు సరిగా అబ్బాలేదు నాకు... మా నాన్నకు నా చిన్నప్పుడు అన్నీ నిరాశలే నా వల్ల. నేను నల్లగా ఉండే సరికి సినిమాల్లో పనికిరావు అని చాలామంది అనేవారు. ఆ మాటల వలన కూడా మా నాన్న బాధపడేవారు. కానీ ఇప్పుడు నన్ను చూసి ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. కృష్ణంరాజు గారు నన్ను మంత్రి అని పిలుస్తూ ఉంటారు. మా ఊళ్ళో చిన్నప్పుడు మా వీధిలోంచి ఎవరైనా సెకండ్ షో చూసి త్రిబుల్స్ ఎక్కి వస్తే వాళ్ళను ఆపి డబ్బులు వసూలు చేసేవాడిని" అని చిన్నప్పటి ఫన్నీ ఇన్సిడెంట్స్ చెప్పాడు శీను.