English | Telugu

కొత్త సీరియల్ "పొదరిల్లు" త్వరలో...


స్టార్ మాలో త్వరలో ఒక కొత్త సీరియల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. అదే "పొదరిల్లు" పేరుతో రాబోతోంది. దాని ప్రోమో కూడా రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. తమిళ్ లో సూపర్ హిట్ ఐన "అయ్యనార్ తునై" అనే సీరియల్ ని కన్నడలో "గంధదగుడి" అనే పేరుతో రీమేక్ చేశారు. ఇప్పుడు దీన్ని "పొదరిల్లు" పేరుతో తెలుగులో రీమేక్ చేసి లాంఛ్ చేయబోతున్నారు. ఇక ఇందులో దీపక్ కుమార్ హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్ గా కృత్తికా ఉమాశంకర్ నటిస్తోంది. ఈమె ఇప్పటికే "మగువ ఓ మగువా" అనే సీరియల్ లో నటిస్తోంది. ఇందులో హీరో తల్లి చనిపోయి హీరో ఒంటరి వాడైపోతాడు.

ఎవరూ ఉండరు. మేనత్త కూడా పట్టించుకోదు. "నేను ఎలాగైనా పెళ్లి చేసుకుని ఈ ఇంటికి మహాలక్ష్మిని ఆడ దిక్కుగా తెస్తాను ఇదే నా శపధం" అంటాడు హీరో. "డబ్బు అక్కరలేదు, కులం పట్టింపు లేదు, అమ్మాయి ఐతే చాలు..నవ మన్మధుడు లాంటి పెళ్లి కొడుకు సిద్ధంగా ఉన్నాడు" అంటూ పామ్ప్లేట్స్ వేసి అమ్మాయిలకు పంచుతూ ఉంటాడు. "శపధం చేసి తెస్తానన్న మహాలక్ష్మి ఈ భూమి మీద ఉందా" అని హీరో ఫీలవుతున్న టైములో గుళ్లో గంట మోగడం "ఏ టాక్సీ వస్తారా" అంటూ ఒక అందమైన అమ్మాయి హీరోని పిలవడం జరిగిపోతాయి. "వీడు ఊహించుకుంటున్న ఆ ఇంటి మహాలక్ష్మి ఈమేనా..తప్పకుండ సీరియల్ చూడండి" అంటూ రిలీజయినా ఒక ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హీరో ఒక టాక్సీ డ్రైవర్. పెళ్లి చేసుకోవడం కోసం ఒక గొప్ప ఆఫర్ కూడా ఇచ్చాడు. "పెళ్లి కానీ ఆడవాళ్లకు 50 % డిస్కౌంట్" అని బోర్డు పెట్టుకున్నాడు. మరి ఈ సీరియల్ త్వరలో అన్నారు కానీ డేట్ టైం ప్రస్తుతానికి రివీల్ చేయలేదు.