English | Telugu

నయని పావని ఎగ్జిట్ ఇంటర్వ్యూ.. అన్ ఫెయిర్ ఎలిమినేషనా!

బిగ్ బాస్ సీజన్-7 ఉల్టా పుల్టా థీమ్ తో ఆకట్టుకుంది. హౌస్ లోని కొత్త కంటెస్టెంట్స్ లో అందరితో బాగా కలిసిన అమ్మాయి నయని పావని. ఈమె ఆరోవారం ఎలిమినేషన్ అయింది. అయితే ఇప్పుడు ఈ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అంటూ నెటిజన్లు ట్వీట్లు చేస్తుండగా.‌ ట్విట్టర్ లో నయని పావని ట్రెండింగ్ లో ఉంది.

తాజాగా విడుదలైన బిబి బజ్ ఎగ్జిట్ ప్రోమోలో యాంకర్ గీతు రాయల్ అడిగే ప్రశ్నలకు కన్నీళ్ళే సమాధానమంటూ, మౌనంగా ఉండిపోయింది నయని. హౌస్ లోకి మెరుపుతీగలా వెళ్ళి మెరుపులా బయటకు వచ్చేశావ్ కదా? ఏం అని ఊహించుకున్నావని గీతు అడుగగా.. లాస్ట్ వీక్ వరకు ఉందామని వెళ్ళానని నయని అంది. 2.0 లో భాగంగా అయిదుగురు కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా నయని పావని హౌస్ లోని అందరితో ఇట్టే కలిసిపోయిన విషయం అందరికి తెలిసిందే. హౌస్ లో ఎవరితో మీరు ఎక్కువగా ఉన్నారని గీతు అడుగగా.. మై డాడ్ శివాజీ గారు.. ఆయన్ని చూడగానే నాన్నలా అనిపించారు. రోజు పొద్దున్నే వెళ్ళి ఆయన్ని హత్తుకొని తర్వాత పనులు చేసేదాన్ని, పల్లవితో బాగా కలిసాను. భోలా ఏం లేదు డొల్లా అంటూ నయని అంది.

నువ్వు కాకుండా హౌస్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకుమ్నావని గీతు అడుగగా.. అశ్విని అని అనుకున్నట్టుగా నయని అంది. తేజని కావాలనే నామినేట్ చేసావా అని అడిగితే.. అదేం లేదు, అతని ఆటకి అలా అనిపించిందని నయని అంది. ఇలా ఒక్కో కంటెస్టెంట్ గురించి తన పాయింటాఫ్ లో సమాధానాలు చెప్పుకొచ్చింది నయని. అయితే ఇప్పుడు నయని పావని ఇంటర్వ్యూ ఎమోషనల్ గా సాగిందని బయట టాక్ నడుస్తుంది. అయితే గీతు రాయల్ అడిగే ప్రశ్నలకు నయని కాస్త ఇబ్బంది పడిందంట. నయని పావని పోస్ట్ ఎలిమినేషన్ ఇంటర్వ్యూ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

Jayam serial: వీరూ ప్లాన్ ని కనిపెట్టిన గంగ.. రుద్ర తెలుసుకుంటాడా!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -146 లో.... రుద్రకి ఎదురుగా గంగ వెళ్తుంది కానీ రుద్ర ఫోన్ మాట్లాడుతూ వెళ్ళిపోతాడు. కొంచెం దూరం వెళ్ళగానే రుద్రకి రింగ్ కనిపిస్తుంది. అది తీసుకొని చూస్తాడు. అప్పుడే ప్రమీల, ప్రీతీ వస్తారు. అన్నయ్య ఆ రింగ్ గంగ వదినది అని ప్రీతీ అంటుంది. ఈ రింగ్ ప్రపంచంలో ఆవిడకి ఒక్కదానికే ఉందా ఏంటని రుద్ర అంటాడు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న గంగని రుద్ర పిలుస్తాడు. గంగ ముసుగులో ఉంటుంది. రుద్ర పిల్వగానే వస్తుంది. ఈ రింగ్ మీదేనా అని అడుగుతాడు. గంగ నాదేనని తీసుకుంటుంది..