English | Telugu

శివాజీకి హెల్త్ ఎమర్జెన్సీ.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 రోజుకో ట్విస్ట్ తో ఆసక్తికరంగా సాగుతోంది. తాజాగా బిగ్ బాస్ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటంటే బిగ్ బాస్ హౌస్ నుండి శివాజీని బయటకు పంపించేశాడు. ఈ సీజన్ విన్నర్ అయ్యే అవకాశాలు ఎవరికి ఉన్నాయంటే ఎక్కువగా వినిపించే పేరు శివాజీ. ఆయన టాప్-5 లో ఖచ్చితంగా ఉంటానని మొదటి వారం నుంచే ప్రేక్షకులు బలంగా నమ్ముతున్నారు. అలాంటి శివాజీ సడెన్ గా హౌస్ నుండి బయటకు వచ్చాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు.

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి నయని పావని ఎలిమినేట్ అయింది. అయితే ఆమెని బయటకు పంపించే సమయంలో శివాజీ చేసిన రిక్వెస్ట్ అందరినీ ఆశ్చర్య పరిచింది. నయని పావనిని కూతురిలా భావించిన శివాజీ.. ఎలిమినేషన్ సమయంలో ఆమె బాధని చూడలేక అవకాశముంటే ఆమెకి బదులుగా తనను బయటకు పంపించాలని కోరాడు. అయితే అది బిగ్ బాస్ రూల్స్ కి విరుద్ధమని హోస్ట్ నాగార్జున తెలిపాడు. దీంతో నయని పావని ఎలిమినేట్ అయింది.

అయితే తాజాగా విడుదలైన ప్రోమోలో శివాజీని హౌస్ నుండి బయటకు పంపించడం సంచలనంగా మారింది. ప్రోమోలో "శివాజీ మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళడం జరుగుతుంది" అని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో "నేను బయటకు వెళ్తున్నాను" అంటూ హౌస్ మేట్స్ కి చెప్పిన శివాజీ బయటకు వచ్చేశాడు. ఆ సమయంలో హౌస్ మేట్స్ "వెళ్ళొద్దు" అంటూ ఎంతో బాధ పడ్డారు. పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ అయితే కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు.

హౌస్ నుంచి శివాజీ బయటకు వచ్చాడనే న్యూస్ ఫ్యాన్స్ ని, ప్రేక్షకులని షాక్ కి గురి చేసింది. అయితే ఆయన బయటకు రావడానికి ఆరోగ్య సమస్యే కారణమని తెలుస్తోంది. ఇటీవల ఒక టాస్క్ లో శివాజీ చేతికి బలమైన గాయమైంది. దీంతో ఆయన చేతికి తీవ్రమైన నొప్పి వస్తుంది. ఆ నొప్పి భరించలేక పోయిన శివాజీ.. బిగ్ బాస్ కి చెప్పడంతో.. ఆసుపత్రికి వెళ్ళడం కోసం బయటకు పంపించారు. వైద్య పరీక్షల అనంతరం మళ్ళీ శివాజీ హౌస్ లోకి అడుగు పెట్టనున్నారని సమాచారం. ఏది ఏమైనా శివాజీ హౌస్ నుంచి బయటకు వచ్చారనే వార్త బిగ్ బాస్ ఫ్యాన్స్ ని ఉలిక్కిపడేలా చేసింది. అయితే ఆయన మళ్ళీ హౌస్ కి వస్తున్నారని తెలుస్తుండటంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు.

Podarillu : భూషణ్ మాటలు విని మహాని కొట్టిన ప్రతాప్.. తను ఏం చేయనుంది!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podarillu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -20 లో.....మీరు ఎవరికీ చెప్పకుండా పారిపోండి అని మహాకి చక్రి సలహా ఇస్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ వాడికోసం మా నాన్న పరువు తియ్యాలా అని చక్రిపై మహా కోప్పడుతుంది. మహా తన గదిలోకి వెళ్లి.. మా నాన్న నన్ను చాలా బాగా చూసుకున్నాడు. అలాంటిది తనని మోసం చెయ్యలేనని మహా అనుకుంటుంది. అప్పుడే మహాకి భూషణ్ ఫోన్ చేస్తాడు. చిరాకుగా ఫోన్ పక్కన పెడుతుంది మహా. మళ్ళీ మళ్ళీ భూషణ్ ఫోన్ చేస్తుంటే ఫోన్ కట్ చేస్తుంది. ఏంటి నా ఫోన్ కట్ చేస్తుందా అని హారికకి ఫోన్ చేస్తాడు భూషణ్.