English | Telugu

పల్లవి ప్రశాంత్ బజ్ లో చెప్పిన షాకింగ్ నిజాలివే!

బిగ్ బాస్ సీజన్‌-7 అల్టిమేట్ ట్విస్ట్ లతో అదరహో అనిపించింది. ‌పదిహేనువారాల పాటు ఈ సాగిన ఈ షోలో కామన్ మ్యాన్ వర్సెస్ సెలబ్రిటీ అన్నట్టుగా ప్రతీ వారం సాగుతూ చివరికి కామన్ మ్యాన్ గా వచ్చిన రైతుబిడ్డకే టైటిల్ సొంతం అయింది.

బిగ్ బాస్ హౌస్ లోకి కామన్ మ్యాన్ క్యాటగిరీలో అడుగుపెట్టాడు పల్లవి ప్రశాంత్. శివాజీని మొదట అన్న అని పిలిచి తనకి దగ్గరయ్యాడు. ఇక కామన్ మ్యాన్ కి తన సపోర్ట్ ఇవ్వాలని శివాజీ అతని వెన్నంటే ఉంటూ వచ్చాడు. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ టైటిల్ విజేత అయ్యాక పట్టరాని సంతోషంతో‌ నోట‌ మాట రాకుండా ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత బిబి బజ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు ప్రశాంత్. ‌ బిగ్ బాస్ ప్రయాణంలో తన భావోద్వేగాలని బజ్ లో పంచుకున్నాడు. గత సీజన్ లో కామన్ ఆడియన్స్ గా వచ్చి ఇప్పుడు కప్ కొట్టి నా ముందు కూర్చున్నావ్ ఎలా ఉంది అని అడుగగా.. అసలు మాటలు రావట్లేదు. ఈ కప్ నాకు ఓటు వేసి గెలిపించిన ప్రతీ ఒక్కరిదని, కీరవాణి సర్ హౌస్ లోకి వచ్చినప్పుడు బిబి అంటే భూమిబిడ్డ అని అన్నాడు. ఈ కప్ లో బిబి చూసి చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. రైతుబిడ్డగా ఈ విజయం రైతులందరి విజయం అని పల్లవి ప్రశాంత్ అన్నాడు. అసలు బిగ్ బాస్ కి రావాలనే ఆలోచన ఎందుకు వచ్చిందని అడుగగా.. రైతులకోసం వచ్చాను. వాళ్ళని వాళ్ళు రైతులని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు.‌ అంతెందుకు‌ నాకే జరిగింది. ఒక పెద్దాయన మా నాన్న దగ్గరికి వచ్చి వేరే మాట్లాడిండు. తక్కువగా చూసాడు. బాయి కాడ పనిచేసేటోడు అంటే ఇంత చిన్నచూపా? అని అనుకున్నాను. బాయి కాడ పనిచేసేటోడు ఎందులోనైన గెలుస్తాడని, నిరూపిస్తానని మా బాపుకి మాటిచ్చా ఇక్కడికి వచ్చానని ప్రశాంత్ అన్నాడు. సెకెండ్ వీక్ లో అందరు కలిసి నీ మీద నామిమేట్ చేసినప్పుడు నీకేమనిపించిందని అడుగగా.. మొదట షకీల అమ్మ చేసింది పర్లేదు అన్నాను.. ఆ తర్వాత శుభశ్రీ చేసింది. ఆ తర్వాత ఆరుగురు చేశారు. ఆ ఆరుగురు కాస్త పది మంది అయ్యారు. ఏం చేయాలో అర్థం కాలేదు. నోట మాట రాలేదు. నా మనిషి అనుకున్న రతిక కూడా నామినేషన్ చేసిందని భాదపడ్డాడు ప్రశాంత్.

నీకు రతికమీద ఏం లేదా అని అడుగగా.‌. ఏం లేదు. మొదట వీఐపీ రూమ్ లో లేడీ లక్ బ్యాండ్ ని ఇచ్చినప్పుడు మన మనిషి అని అనపించింది‌ అందుకే ఇచ్చాను. అది ప్రేమ కాదు. చూడగానే మన‌ ఇంట్లో మనిషిలా‌ అనిపించింది అందుకే తనతో అలా ఉన్నాను కానీ వీకెండ్ లో నాగార్జున సర్ రతికని.. నీ గేమ్ కి ఎవరు అడ్డు అని అడిగినప్పుడు తను నా పేరు చెప్పింది. అప్పుడే నాకనపించింది నా వల్ల తన గేమ్ పాడవకూడదని, తనకి దూరంగా ఉండి నా ఆట నేను ఆడుకున్నానని ప్రశాంత్ అన్నాడు. రతికని అక్క ఎని ఎందుకు అన్నావని అడుగగా.‌. నామినేషన్ తర్వాత ఏకవచనం వద్దు బహువచనంలో పిలవమని తను అన్నప్పుడు మాటల్లో మాట ఏం అని పిలవాలని అన్నప్పుడు.. నన్ను తమ్ముడు అని అంది. నేను అక్క అని అన్నాను. ఆ తర్వాత మళ్ళీ రెండోసారి హౌస్ లోకి వచ్చాక అక్క అని పిలవకు అని అంది.. నేను దిల్ సే ఒక్కసారి పిలిచినప్పుడు అంతే ఇంక మళ్ళీ పేరు పెట్టి పిలువనని చెప్పా అని ప్రశాంత్ అన్నాడు.