English | Telugu

సుమ అడ్డాలో రాజీవ్ కనకాలతో లవ్ ట్రాక్...

సుమ అడ్డా 50 వ ఎపిసోడ్ కి చేరుకుంది. ఈ షో ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ కి బాబుల్ గం మూవీ టీమ్ వచ్చింది. రాజీవ్ కనకాల మంచి జోష్ తో హ్యాండ్ సం లుక్ తో రెడ్ బెలూన్స్ పట్టుకుని "ప్రియతమ నీవచట కుశలమా" అని పాడుకుంటూ వచ్చి సుమకి ఆ బెలూన్స్ ని ఇచ్చాడు.

ఇక ఈ షోలో రాజీవ్ కనకాలను కొన్ని ప్రశ్నలు అడిగింది సుమ. "మీ ఆవిడ అంటే మీకు గుర్తొచ్చేదేమిటి" అనేసరికి " అత్యద్భుతమైన నవ్వు గుర్తొస్తుంది" అనేసరికి సుమ సిగ్గులమొగ్గైపోయింది. "ఏయ్..ఏది స్మైల్ " అంటూ ఇంట్లో అడిగినట్టు షోలో కూడా అడిగేసరికి "రాజా ఆపు" అంటూ సుమ సిగ్గుపడిపోయింది " సుమా ఏది స్మైల్ చెయ్యి" అనేసరికి పడీపడీ నవ్వేసింది..తర్వాత "ఇజ్జత్" అనే సాంగ్ కి రాజీవ్ కనకాల స్టేజి మీదకు వచ్చి తనకు వచ్చిన అన్ని ఎక్సర్సైజస్ చేసేసరికి "నువ్వే చూసావ్ గా నాకు నువ్వే సపోర్ట్ చేయాలి" అని రోషన్ సుమని అడిగేసరికి " పోనీలే నాన్న నీ సినిమా వలన నాన్న ఎక్సర్సైజు చేస్తున్నాడు" అని కామెడీ చేసింది సుమ. తర్వాత ఉప్పెన మూవీలో "జలజలపాతం" సాంగ్ కి బాబుల్ గం హీరో హీరోయిన్స్ పడవలో పెర్ఫార్మ్ చేసారు. ఇక ఆ సీన్ చూడలేక సుమ కనకాల తన ఫేస్ ని కప్పేసుకుని కట్ ఇట్ అనేసరికి మీరే కదా యాక్ట్ చేయమంది అని సీరియస్ అయ్యాడు రోషన్ కనకాల. ఇక ఈ షోలో టోటల్ ఫామిలీని చూసిన ఆడియన్స్ బెస్ట్ ఫామిలీ, బెస్ట్ కపుల్, నైస్ రోషన్, సుమ నవ్వు చాలా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ 50 వ ఎపిసోడ్ లో సుమ ఫామిలీ మొత్తం ఈ స్టేజి మీద ఫన్ క్రియేట్ చేయడం చూసిన ఆడియన్స్ ఇది మంచి ఫన్ ఫిల్లింగ్ ఎపిసోడ్ అంటూ రిప్లై ఇస్తున్నారు ఈ ప్రోమోకి..