English | Telugu
పదమూడు వేల ఓట్లతో మొదటి స్థానంలో పల్లవి ప్రశాంత్, రెండవ స్థానంలో శోభా శెట్టి!
Updated : Sep 6, 2023
బిగ్ బాస్ సీజన్-7 రోజు రోజుకి ఇంట్రెస్ట్ గా సాగుతుంది. ఇందులో ఒక్కో కంటెస్టెంట్ ఒక్కో గేమ్ స్ట్రాటజీని ప్లే చేస్తున్నారు. ఇప్పటికే టేస్టీ తేజ తన గేమ్ స్ట్రాటజీని ప్లే చేస్తుండగా శివాజీ మరో బాలాదిత్యలా అనిపిస్తుంది. అయితే ఇప్పటికే నామినేషన్లు పూర్తవ్వగా ఓటింగ్ నిన్న రాత్రి నుండి మొదలైంది. దీన్నో అనుకున్నదే జరిగింది. పల్లవి ప్రశాంత్ కి విశేషమైన మద్దతు లభిస్తుంది. తన తప్పేం లేకున్నా నామినేట్ చేసారని, కార్నర్ చేశారని ప్రతీ బిగ్ బాస్ ప్రేక్షకుడికి తెలుసు అందుకే ఒక్క రోజే ఏకంగా పదమూడు వేల ఓట్లు పల్లవి ప్రశాంత్ కి వచ్చాయి. రెండవ స్థానంలో శోభా శెట్టికి రెండు వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. రతిక మూడవ స్థానంలో కొనసాగుతుంది. ఇక యాక్టర్, డైరెక్టర్ గౌతమ్ కృష్ణ నాల్గవ స్థానంలో కొనసాగుతున్నాడు.
హౌజ్ లో ఎక్కువ కమ్యూనికేషన్ లేకుండా ఉండేవారిలో కిరణ్ రాథోర్ ముందు ఉంటుంది. ఎందుకంటే తనకి తెలుగు సరిగ్గా రాదు, అర్థం కాదు. అందుకే తను ఓటింగ్ లిస్ట్ లో చివరన ఉంది. ఈ వారం ఎలిమినేషన్ కి దగ్గరగా ఉంది కిరణ్ రాథోడే అని వినిపిస్తుంది. కాగా షకీల గారు కంటెస్టెంట్స్ తో ఇప్పుడిప్పుడే కలుస్తున్నారు. సింగర్ దామిణి అందరితో అంత ఈజీగా కలిసిపోలేకపోవడంతో చివర నుండి రెండవ స్థానంలో కొనసాగుతుంది. ఇలాగే ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా ఉంటే సింగర్ దామిణి కూడా ఎలిమినేషన్ తప్పదు. అలాగే ప్రిన్స్ యావర్.. హిందీ, ఇంగ్లీష్ తప్ప తెలుగు అంతగా రానీ మేల్ కంటెస్టెంట్. అయితే బిగ్ బాస్ గ్రాంఢ్ రిలీజ్ రోజే.. తెలుగు రోజుకొక వర్డ్ నేర్చుకోమని ప్రిన్స్ యావర్ కి నాగార్జున చెప్పాడు.
ఇప్పుడు బిగ్ బాస్ హౌజ్ లో ఉన్న అందరిలో అమర్ దీప్, ప్రియాంక సేఫ్ గేమ్ ఆడుతున్నారు. ఇక శోభా శెట్టి కార్తీక దీపంలో నటించినట్టే ఇందులో కూడా నటిస్తుందని తెలుస్తుంది. ప్రతీ దానికి ఏడుస్తూ సింపతీని కోరుకుంటుంది. మరి తన ఏడుపు ఎంతవరకు వర్క వుట్ అవుతుందో తెలియదు. అయితే ఇప్పటివరకు నామినేషన్లో ఉన్నావారికి జరిగిన ఓటింగ్ లో మొదటి స్థానంలో పల్లవి ప్రశాంత్, రెండవ స్థానంలో శోభా శెట్టి కొనసాగుతున్నారు. కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. చివరలో ఉన్న దామిణి, కిరణ్ రాథోడ్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి మరి!