English | Telugu

ఎన్ని జన్మలెత్తినా మీ రుణం తీర్చుకోలేను : పల్లవి ప్రశాంత్

నాన్న.. ప్రతీ ఒక్కరిని వెంటాడే ఒక ఎమోషన్. ప్రతీ కూతురికి నాన్నే సూపర్ హీరో. ప్రతీ కొడుక్కీ నాన్నే రోల్ మోడల్. అలాంటి నాన్నని ఆ కొడుకు ముందే ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే.. నీ‌ కొడుకు అంత చదివి రైతుగా ఉన్నాడా అని అవహేళన చేస్తే ఆ కొడుకు ఏం చేశాడు. బిగ్ బాస్ సీజన్‌ సెవెన్ లోకి వచ్చాడు.. గెలిచాడు.‌ అవును పల్లవి ప్రశాంత్ కి జీవితంలో జరిగిన అవమానం నుండి తనలో కలిగిన ఈ లక్ష్యమే బిగ్ బాస్.

బిగ్ బాస్ హౌస్ లో ఎంట్రీ ఇచ్చి సెలబ్రిటీలతో పోటీ పడీ రైతు తల్చుకుంటే ఏదైన సాధించగలడని నిరూపిస్తానని చెప్పాడు.. చేసి చూపించాడు పల్లవి ప్రశాంత్. బిగ్ బాస్ హౌస్ లోకి కామన్ మ్యాన్ గా అడుగుపెట్టాడు ప్రశాంత్.‌ మొదట్లో అందరు రైతుల పేరు చెప్పుకొని కావాలని నటిస్తున్నాడని అన్నారు.‌ కానీ రోజులు గడిచేకొద్దీ అతని పట్టుదల, గెలవాలనే కసి, ప్రతీ టాస్క్ అతను చూపే ఎఫర్ట్స్ అన్నీ కూడా ప్రతీ ఒక్క బిగ్ బాస్ అభిమానికి కనెక్ట్ అయ్యాయి. హౌస్ లో అందరితో ఒకేలా ఉన్న‌ ప్రశాంత్‌కి శివాజీ తన సపోర్ట్ ఇచ్చాడు. ఎవరితో ఎలా ఉండాలో చెప్పాడు. ఇక హౌస్ లో ఫ్యామిలీ వీక్ లో భాగంగా.. అందరి ఫ్యామిలీ వాళ్ళు వచ్చారు. ఒక్క పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్న రాకపోవడంతో పొద్దున్నుండి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఎదురుచూసాడంట ప్రశాంత్. శోభాశెట్టి, ప్రియాంక తినమని చెప్పిన తినని మొండిగా ఉన్నాడంట ప్రశాంత్. ఆ తర్వాత బంతిపూలని పంపించాడు బిగ్ బాస్. ఆ పూలని చూసిన శివాజీ.. ' రేయ్ పల్లవి.. మీ చేనులో పూసిన బంతిపూలు రా' అని చూపించడంతో కంటతడి పెట్టుకున్నాడు ప్రశాంత్. ఇక కాసేపటికి.. బాబు బంగారం అంటూ పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్న హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. నాన్నని చూసిన ఆనందంలో పరుగున వెళ్ళి కాళ్ళమీద పడిపోయాడు ప్రశాంత్. నాన్నని పైకి ఎత్తుకొని.. జై కిసాన్ జై జవాన్. మళ్లొచ్చిన అంటే తగ్గేదేలే అంటూ అరవడంతో బిగ్ బాస్ హౌస్ మొత్తం దద్దరిల్లిపోయింది. నా బిడ్డని మంచిగా చూసుకోండ్రి అని హౌస్ మేట్స్ అందరికి చేతులెక్కి మరీ మొక్కాడు. " గొడవలు పెట్టుకోకండి. కొట్టుకోకండి.. కలిసి మెలిసి ఉండండి" అంటూ అమర్ దీప్ తో పల్లవి ప్రశాంత్ వాళ్ళ నాన్న అన్నాడు. ఇక నాన్నకి ఆప్యాయంగా అన్నం తినిపించాడు పల్లవి ప్రశాంత్. ఓ ప్లేట్ లో అన్నం మెతుకుల్లా మీరంతా కలిసి మెలిసి ఉండాలే. ఎవరి ఆట వారిదే. ఆట అయిపోయాక అంతా మరిచిపోయి కుటుంబం మాదిరి ఉండాలి అని హౌస్ మేట్స్ తో అన్నాడు ప్రశాంత్ వాళ్ళ నాన్న.

ఇక గ్రాంఢ్ ఫినాలేలో అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ఇద్దరు ఉండగా విజేతగా‌ ప్రశాంత్ ని ప్రకటించాడు నాగార్జున. ఒక కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన ఏ కంటెస్టెంట్స్ టాప్-5 వరకు రాలేదు.‌ దేశంలో ఏ బిగ్ బాస్ లోను కామన్‌మ్యాన్ గెలిచింది లేదు. ‌ఇక ట్రోఫీ తీసుకొని వచ్చిన పల్లవి ప్రశాంత్ కోసం తన అభిమానులు ఎంతగానో ఎదురుచూసారు.‌ ఇక‌ నానా‌ రచ్చచేసి ట్రాఫిక్ వాయిలెన్స్ ‌ని క్రియేట్ చేశారు. దాంతో ప్రశాంత్‌ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ప్రశాంత్ కోసం వాళ్ళ నాన్న చంచల్‌గూడ జైలు బయట ఫుట్ పాత్‌ మీద పడుకొని ఎదురుచూసాడు.‌ ఇక ఆ వార్త అప్పడు ఫుల్ ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ గా మారింది. ‌ఇక ఇప్పుడు ‌ఆ వీడియోని తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన ప్రశాంత్.. వాళ్ళ‌ నాన్న పాదాలకి నమస్కరించాడు.‌ ఇక అమ్మనాన్నల ఆశీర్వాదం తీసుకొన్నాడు‌‌ ప్రశాంత్. ఎన్ని జన్నలెత్తిన మీ రుణం తీర్చుకోలేను‌ బాపు, అమ్మ ‌అని పోస్ట్ కి రాసుకొచ్చాడు ప్రశాంత్. కాగా ఈ పోస్ట్ కి తెగ కామెంట్ లు వస్తున్నాయి. ‌ఇన్ స్టాగ్రామ్ లో ఈ వీడియో ఫుల్ ట్రెండింగ్ లా మారింది.