English | Telugu
Krishna Mukunda Murari: దమ్ముంటే కాస్కోమని ఛాలెంజ్ చేసిన మురారి.. ఆ స్కెచ్ లో ఉందెవరు?
Updated : Dec 31, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -354 లో.. రేవతి, కృష్ణ నందు కలిసి మాట్లాడుకుంటారు. అప్పుడే అక్కడికి దేవ్ వచ్చి.. కృష్ణని కిట్టమ్మ అంటాడు. అది విని కృష్ణ ఎమోషనల్ అవుతూ.. ఇంత మంచి వాడిని మధు ఎందుకు అపార్థం చేసుకుంటున్నాడని అనుకుంటుంది. కాసేపటికి తప్పు చేసినోడు ఎవరైనా సరే వాడిని చంపి నేను జైలుకి వెళ్తానని దేవ్ తన మాటలతో అందరిని ఇంప్రెస్ చేస్తాడు.
కాసేపటికి నువ్వు ఎందుకు అన్నయ్య, ఏసీపీ సర్ వాడి సంగతి చూసుకుంటాడని కృష్ణ అంటుంది. మీరేమో కానీ ముందు వాడు నా చేతికి దొరకనివ్వు వాడి సంగతి చెప్తానంటూ రేవతి అంటుంది. మరొకవైపు మురారి వెళ్లకుండా ముకుంద అడ్డుపడుతుంది. అడ్డు తప్పుకో ముకుంద అని మురారి అంటాడు. అడ్డుతప్పు కోవాల్సింది నేను కాదు.. ఆ కృష్ణ , ప్రభాకర్ అని ముకుంద అనగానే.. ఇంకొకసారి కృష్ణ గురించి మాట్లాకని మురారి కోపంగా చెప్తూ.. ఇక ఆలోచన మానుకోమని అంటాడు. నువ్వే నా జీవితమని ముకుంద అంటుంది. అది వేరోకరిని పెళ్లి చేసుకోకముందు అనాలి. అప్పుడే నువ్వు ఇలా అడ్డు పడిఉంటే బాగుండేది. అల్లారు ముద్దుగా ఆదర్శ్ ని చూసుకుంది మా పెద్దమ్మ.. కానీ నీ వల్ల ఆదర్శ్ మా పెద్దమ్మకి దూరం అయ్యాడు. నిన్ను ఆదర్శ్ ప్రాణంగా ప్రేమించాడని మురారి అంటాడు. కృష్ణ తప్పు చేసిందని ఋజువు అయితే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. కృష్ణ ఏ తప్పు చెయ్యలేదని ఋజువు అయితే నువ్వు ఆదర్శ్ ని భర్తగా ఒప్పుకోవాలని ముకుందకి మురారి ఛాలెంజ్ విసురుతాడు.
మరొకవైపు భవాని తప్ప అందరు భోజనం చెయ్యడానికి వస్తారు. భవానిని తీసుకొని రావడానికి మురారి తన గదికి వెళ్తాడు. భవాని రానని చెప్తుంది. దాంతో మురారి రిక్వెస్ట్ చేసి తీసుకొని వస్తాడు. పెద్దమ్మ పక్కన కూర్చొని భోజనం చేద్దాం.. చైర్ లు ఖాళీగా ఉంచమని కృష్ణకి మురారి మెసేజ్ చేస్తాడు. దాంతో వాళ్ళు వచ్చేసరికి కృష్ణ రెండు చైర్ లు ఖాళీగా ఉంచుతుంది. ఇక అందరు కలిసి భోజనం చేస్తుండగా ముకుంద కావాలని భవాని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంటుంది. పెద్దమ్మ మీరు ఒకరి మాటలు వినడం నేను ఎప్పుడు చూడలేదని మురారి అంటాడు. తరువాయి భాగంలో పరిమళ చెప్పే లక్షణాల ఆధారంగా శ్రీధర్ స్కెచ్ తో బొమ్మ గీస్తుంటాడు. ఆ స్కెచ్ ని చూసి ఇంట్లోని వాళ్ళంతా షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.