English | Telugu
Jabardasth New Anchor: జబర్దస్త్ కి కొత్త యాంకర్‌గా బిగ్ బాస్ బ్యూటి వచ్చిందోచ్!
Updated : Nov 5, 2023
బుల్లితెర మీద పని చేసే యాంకర్లు ఎప్పుడు ఎలా చేంజ్ ఐపోతారో ఎవరికీ తెలీదు. ఇప్పుడు కూడా ఒక షో విషయంలో అలాగే జరిగింది. ఆ షో పేరే జబర్దస్త్. ఈ షోకి ఫస్ట్ అనసూయ యాంకర్ గా చేసిన విషయం తెలిసిందే. తర్వాత అనసూయ వెళ్ళిపోయి రష్మీ ఎంట్రీ ఇచ్చింది. రష్మీ అటు జబర్దస్త్ ని, ఇటు ఎక్స్ట్రా జబర్దస్త్ ని మేనేజ్ చేసింది.
ఇక రష్మీ కూడా మూవీ ఛాన్సెస్ వస్తుండడంతో డేట్స్ తో ఇబ్బంది అయ్యేసరికి ఆమె ప్లేస్ లో జబర్దస్త్ షోకి సౌమ్యరావు ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఆ సౌమ్య రావు కూడా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసింది. ఇక ఆమె ప్లేస్ లో అందరికీ తెలిసిన సిరి హన్మంత్ దూసుకొచ్చేసింది. జబర్దస్త్ నెక్స్ట్ వీక్ ప్రోమో చూస్తే ఆ విషయం అర్ధమవుతుంది. బిగ్ బాస్ బ్యూటీ యాంకరింగ్ చేస్తూ కనిపించింది. ఇక ఈ షోకి జడ్జెస్ ఉన్న ఇంద్రజ, కృష్ణ భగవాన్ కూడా ఆమెకు ఘనంగానే స్వాగతం పలికారు.
బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి హనుమంత్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి క్రేజ్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అలాగే సిరి ఇటీవల షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీలో కూడా నటించింది. ఆ క్యారెక్టర్ తో సిరి హన్మంత్ కి మంచి గుర్తింపు లభించింది. అలాగే పులి- మేక వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.
ఇక ఇప్పుడు జబర్దస్త్ షోతో యాంకర్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూ మరింత ఫాలోయింగ్ ని పెంచుకునే పనిలో పడింది సిరి. సిరి హనుమంత్, శ్రీహాన్ జోడి గత తొమ్మిదేళ్లుగా లవ్‌లో లవ్ చేసుకుంటున్నారు. ఐతే వీళ్ళను పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో ఎవరికీ తెలీదు. వాళ్ళ పెళ్లి విషయం ఎప్పుడూ సస్పెన్సు లో పెడుతూనే ఉంటారు. కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదంటారు అంటూ మాట దాటవేస్తుంది సిరి. సోషల్ మీడియాలో ఈ జోడి ఫుల్ యాక్టివ్ గా ఉంటారు. మరి ఈ బ్యూటీ ఈ షో యాంకర్ గా ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి.