English | Telugu

తారక్, మహేష్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' షోతో బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షోలో అప్పుడప్పుడు సెలబ్రిటీస్ కూడా సందడి చేస్తున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, రాజమౌళి, కొరటాల శివ, సమంత సందడి చేశారు. అలాగే ఈ షోలో మహేష్ బాబు కూడా సందడి చేయనున్నారు. ఇప్పటికే షూట్ కూడా పూర్తయింది. అయితే ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ మరోసారి వాయిదా పడనుందని తెలుస్తోంది.

ఎన్టీఆర్, మహేష్ ల మధ్య మంచి బాండింగ్ ఉంది. మహేష్ ను ఎన్టీఆర్ అన్నయ్య అని పిలుస్తుంటారు. దీంతో మహేష్ 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' షోలో పాల్గొనబోతున్నారన్న న్యూస్ రాగానే ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆ ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదట ఆ ఎపిసోడ్ దసరాకు టెలికాస్ట్ కానుందని వార్తలొచ్చాయి. అయితే దసరాకు సమంత ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. దీంతో దీపావళికి మహేష్ ఎపిసోడ్ టెలికాస్ట్ అవుతుందని భావించారంతా. కానీ దీపావళికి కూడా మహేష్ ఎపిసోడ్ టెలికాస్ట్ కావట్లేదని తెలుస్తోంది. దీపావళికి మ్యూజిక్ డైరెక్టర్స్ దేవిశ్రీప్రసాద్, తమన్ పాల్గొన్న ఎపిసోడ్ ప్రసారం కానుందని సమాచారం. దీంతో ఎన్టీఆర్, మహేష్ ల ఫ్యాన్స్ డిస్సప్పాయింట్ అవుతున్నారు.

'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' షో ఈ సీజన్ ను నవంబర్ 18న ప్ర‌సారం కానున్న‌ ఎపిసోడ్ తో ముగించబోతున్నారు. ఆ ఎపిసోడ్‌ లో మహేష్ కనిపించబోతున్నార‌ని ప్రచారం జరుగుతోంది. సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ ని స్టార్ హీరో రామ్ చరణ్ తో స్టార్ట్ చేశారు కాబట్టి.. లాస్ట్ ఎపిసోడ్ ను మరో స్టార్ హీరో మహేష్ తో ఎండ్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో షో నిర్వాహకులు ఇలా ప్లాన్ చేశారని అంటున్నారు.

Jayam serial : పారు వేసిన ప్లాన్.. గంగని అపార్థం చేసుకున్న రుద్ర!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -140 లో..... పెళ్లి అయి మొదటిసారి ఇంటికి వచ్చిన అల్లుడు కూతురికి లక్ష్మి మర్యాదలు చేస్తుంది. రుద్రకి వరుస అయ్యోవాళ్ళు ఒక ఆటాడుకుంటారు. నల్లపూసల కార్యక్రమం అయ్యాక శోభనానికి ఏర్పాట్లు చేస్తారు. ఇద్దరికి బంతాట ఆడిపిస్తారు. బిందెలో రింగ్ తీయిస్తారు. ఇద్దరు సరదాగా ఉంటారు. రుద్ర వంక గంగ చూస్తుంటే.. ఏంటి చూస్తున్నావ్ వెళ్లి కింద పడుకోమని రుద్ర అంటాడు. ఆ తర్వాత రుద్ర, గంగ సరదాగా బాక్సింగ్ చేస్తుంటారు. అప్పుడే రుద్ర కాలికి సెల్ఫీ స్టిక్ తగులుతుంది. అది రౌడీ చేత పారు పెట్టిస్తుంది.