English | Telugu
'ఒక్కడు' మూవీ స్పూఫ్ లో ఓవరాక్షన్ చేసిన నూకరాజు
Updated : Nov 27, 2022
మహేష్ బాబు, భూమిక నటించిన మూవీ 'ఒక్కడు'. ఈ మూవీలో ఆయన మేనరిజమ్, డైలాగ్స్ అదిరిపోతాయి. ఇక హీరోకి పోటీగా విలన్ ప్రకాష్ రాజ్ కూడా పోటీ పడి మరీ నటించారు. ఇక ఇప్పుడు 'జాతిరత్నాలు' షోలో ఇమ్మాన్యుయేల్, నూకరాజు టీమ్ మహేష్ బాబుని ఇమిటేట్ చేద్దాం అనుకున్నారు. కానీ ఫెయిల్ అయ్యారు. వాళ్ళు ఒక్కడు మూవీని స్పూఫ్ గా చేశారు. ఐతే నూకరాజు మరీ ఓవర్ యాక్షన్ చేసినట్టు తెలిసిపోతోంది. నెటిజన్స్ కూడా ఇదే మాట అంటున్నారు.
ఒక్కడు సినిమాలో మహేశ్ బాబు క్యారెక్టర్ నూకరాజు చేశాడు. స్టార్టింగ్ నుంచి ముక్కును వేలితో గోక్కుంటూ కొంచెం ఎక్కువ చేసాడు.. "మొన్న క్యాలీఫ్లవర్ చేశాడు సంపూర్ణేష్ బాబు.. ఈరోజు నేను మహేష్ బాబుని" అంటూ స్టార్ట్ చేశాడు. "ఈసారి కబడ్డీ కర్నూల్ లో గెలవాలన్నయ్య" అంటూ వెటకారం చేసాడు. మహేష్ బాబు క్యారెక్టర్ ని కావాలనే నెగటివ్ గా పెర్ఫార్మ్ చేసినట్లు కనిపిస్తోంది. గతంలో చాలా మూవీ స్పూఫ్స్ చేశారు కానీ ఇలా ఇంత వెటకారంగా ఎప్పుడూ చేయలేదు. మరి ఇప్పుడు ఇలా చేయడం ఏమిటి అని నెటిజన్స్ నూకరాజు మీద విరుచుకుపడుతున్నారు.