English | Telugu
అనిల్ రావిపూడిలో ఈ యాంగిల్ కూడా ఉందా?
Updated : Nov 27, 2022
రియాలిటీ షోస్ లో ఈ మధ్య జడ్జెస్ చాలా తెలివి మీరారు. ఏం చేస్తే ప్రోమోలో పడతారు, ఆడియన్స్ అటెన్షన్ ని తమ వైపు ఎలా తిప్పుకోవాలి వంటి విషయాలను బాగా స్టడీ చేసి జనాల నాడి పట్టుకుంటున్నారు. ఆ విధంగానే ఆడియన్స్ లో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నారు.
కామెడీ స్టాక్ ఎక్స్చేంజ్' పేరుతో ఒక కామెడీ షో త్వరలో ఆహాలో స్ట్రీమ్ కావడానికి సిద్దమయ్యింది. దీనికి సంబంధించిన ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఐతే ఈ ప్రోమో చూస్తే గనక డైరెక్టర్ అనిల్ రావిపూడి యాంకర్ దీపిక పిల్లిని పట్టుకుని లిప్ కిస్ ఇస్తున్నట్లు ఫోజ్ పెట్టాడు. ఈ ఫోజ్ లో అనిల్ రావిపూడిని చూసి జనాలు అవాక్కయ్యారు. ఈ ఒక్క బిట్ తో మొత్తంగా కామెడీ స్టాక్ ఎక్స్ఛేంజ్ షోపై ఆడియన్స్ లో ఆసక్తి అనేది పెరిగింది. అంటే ఎప్పుడూ సరదాగా ఉండే ఈ డైరెక్టర్ లో కూడా ఇలాంటి యాంగిల్ ఉందా? అని ఆశ్చర్యపోతున్నారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడి జడ్జిగా ఉన్న ఈ షోకి దీపికా పిల్లి, సుడిగాలి సుధీర్ హోస్ట్స్ గా చేస్తున్నారు. ఈ షోలో కమెడియన్స్ పెర్ఫార్మ్ చేసే కామెడీకి ఆడియన్స్ మార్క్స్ వేస్తారు. డిసెంబర్ 2 నుండి ఈ షో ప్రారంభంకానుంది. రోజుకో రకం ప్రోమోస్ ని ఆడియన్స్ కోసం సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ ఈ షోకి మంచి పబ్లిసిటీ ఇస్తున్నారు.