English | Telugu
'బిగ్ బాస్-6' విన్నర్ రేవంత్.. హింట్ ఇచ్చిన గెస్ట్స్!
Updated : Nov 27, 2022
బిగ్ బాస్ హౌస్ లో వీకెండ్ రానే వచ్చింది. వారం నుండి కొనసాగుతున్న ఫ్యామిలీ వీక్ ఫుల్ ఆన్ ఎమోషన్స్ తో నిండగా, వీకెండ్ లో వచ్చిన నాగార్జున కూడా రెండింతలుగా ఎంటర్‌టైన్మెంట్ తో శనివారం హౌస్ మేట్స్ ముందుకు వచ్చాడు. గెస్ట్ లతో బిగ్ బాస్ స్టేజ్ 'బంచ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్' గా మారింది.
ఇందులో గెస్ట్ గా వచ్చినవాళ్ళకి "హౌస్ లో ఎవరు టైటిల్ రేస్ లో ఉన్నారు? ఎవరికి ఎవరు పోటీ?" అని చెప్పమన్నాడు నాగార్జున. కాగా వచ్చిన వాళ్ళకి సంబంధించిన అందరూ కూడా రేవంతే కాంపెటీషన్ అని చెప్పుకొచ్చారు. "రేవంత్ ఆటతీరు బాగుంటుంది" అని అందరూ చెప్పారు. దీన్ని బట్టి చూస్తే వచ్చిన గెస్ట్ లు, రేవంత్ కి ఇండైరెక్ట్ గా విన్నర్ నువ్వే అని హింట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
గెస్ట్ లు కొంతమంది పాజిటివ్ పాయింట్స్ చెప్పగా, మరికొంతమంది నెగెటివ్ పాయింట్స్ చెప్పారు. ఎవరు ఏం చెప్పినా కూడా మెజారిటీ అఫ్ గెస్ట్స్, రేవంతే టఫ్ కాంపెటీషన్ అని చెప్పారు. అయితే గెస్ట్ లు చెప్పిన విషయాలు హౌస్ మేట్స్ అందరూ సీరియస్ గా తీసుకొని బాగా ఆడి, తమ పర్ఫామెన్స్ తో ఎవరు ఆకట్టుకుంటారో చూడాలి. కాగా టైటిల్ రేస్ లో ఎవరు ఉన్నారనేది, లాస్ట్ వీక్ వరకు చూడాలి మరి. ఎవరు విన్నరో? ఎవరు రన్నరో? అనే ఈ సస్పెన్స్ కి బ్రేక్ పడాలంటే ఇంకో మూడు వారాలు ఆగాల్సిందే మరి!