English | Telugu
బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. ఆ ముగ్గురిలో హౌజ్ లోకి వచ్చేదెవరు?
Updated : Oct 15, 2023
బిగ్ బాస్ హౌజ్ లో ఉల్టా పల్టా థీమ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. గడిచిన ఐదు వారాల్లో కిరణ్ రాథోడ్, షకీల, సింగర్ దామిణి, రతిక రోజ్, శుభశ్రీ రాయగురు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు కొత్తగా మరో ఐదుగురు ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. కొత్తగా వచ్చిన హౌజ్ మేట్స్ ని పోటుగాళ్ళు అని చెప్పి వారితో టాస్క్ ఆడిస్తున్న విషయం తెలిసిందే.
నిన్న శనివారం హౌస్ లో హౌజ్ మేట్స్ కి మరో బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు బిగ్ బాస్. చివరి మూడు వారాల్లో ఎలిమినేట్ అయిన ముగ్గురిని హౌస్ లోకి తీసుకొచ్చాడు బిగ్ బాస్. దామిణి, రతికరోజ్, శుభశ్రీ రాయగురులని చూసిన హౌస్ మేట్స్ షాక్ అయ్యారు. ఇక ఒక్కొక్కరుగా వచ్చి ఓట్ ని రిక్వెస్ట్ చేశారు. తెలిసో తెలియకో తప్పులు చేశాను. వాటిని సరిదిద్దుకునే అవకాశం వచ్చింది. ఈ సారి ఆ తప్పుల్ని చేయనని తనకు ఓట్ చేయాలని రతిక రిక్వెస్ట్ చేసింది. దామిణి, శుభశ్రీలు కూడా అలాగే రిక్వెస్ట్ చేశారు. కాసేపటికి వాళ్ళ ముగ్గురిని హౌస్ నుండి బయటకు పంపించేశాడు నాగార్జున. ఎలా ఉంది ఈ ఉల్టా పల్టా అని హౌస్ లోని వాళ్ళని నాగార్జున అడుగగా.. సూపర్ సర్, క్రేజీ అంటూ ఒక్కొక్కరు ఆశ్చర్యంగా చెప్పారు. ఇక హౌస్ లోని వాళ్ళకి నాగార్జున ఓట్ చేయమని చెప్పాడు. ఈ ముగ్గురిలో ఎవరైతే హౌస్ లోకి కరెక్టో వారికి ఓట్ చేయండి. హౌజ్ లోకి ఎవరు రావాలో మీ చేతుల్లో ఉందని నాగార్జున చెప్పాడు. ఇక అందరు తమ ఫేవరెట్ ఎవరు? ఎవరైతే హౌజ్ లో కరెక్ట్ అనే ఆలోచనల్లో పడ్డారు. మరి హౌజ్ మేట్స్ అంతా కలిసి ఎవరిని ఎన్నుకుంటారనదే ఇప్పుడు ఆసక్తిగా మారింది.
దామిణి, రతిక, శుభశ్రీలలో విన్నర్ ఎవరో చెప్పకుండా సస్పెన్స్ లో పెట్టాడు బిగ్ బాస్. ఇప్పటికే 2.0 తో ఈ షో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఇక ముందు కొత్త కంటెస్టెంట్ ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది. ఆట ఏ మలుపు తిరగనుందనే అనే ఉత్కంఠ ఇప్పుడు అందరిలో మొదలైంది. మరి ఈ ముగ్గురిలో హౌజ్ లోకి ఎంట్రీ ఇచ్చేది ఎవరు తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.