English | Telugu
స్వీట్ వార్నింగ్ ఇచ్చిన వసుధార.. కోపంతో ఊగిపోయిన శైలేంద్ర!
Updated : Oct 15, 2023
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -894 లో.. కొత్త ఎండీ వసుధార అని మినిస్టర్ చెప్పగానే.. శైలేంద్ర, దేవాయని షాక్ అవుతారు. వసుధార నా భార్య అని నేను ఈ నిర్ణయం తీసుకోలేదు. తనకి కాలేజీ గురించి మొత్తం తెలుసు. తనైతే ఎండీ గా బాగుంటుందని నిర్ణయం తీసుకున్నానని రిషి అంటాడు. అందరు రిషి చెప్పిన దానికి క్లాప్స్ కొడుతారు.
ఆ తర్వాత వసుధార అంటే నాకు ఇష్టమే కానీ ఆ చైర్ లో రిషి అయినా ఇంకా ఎవరైనా కూర్చుని ఉంటే బాగుండేదని దేవయాని అంటుంది. ఇప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పాను కదా పెద్దమ్మ అని రిషి అంటాడు. ఆ తర్వాత రిషి వసుధార చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్లి.. ఎండీ చైర్ లో కూర్చోపెడతాడు. ఇప్పుడు నేను MD.. మీరు MH అని వసుధార అనగానే MH అంటే ఏంటి అని మినిస్టర్ అడుగుతాడు. వసుధార కవర్ చేస్తూ మిషన్ ఎడ్యుకేషన్ హెడ్ అని చెప్తుంది. ఇద్దరు కలిసి పని చేసి కాలేజీని ముందుకు తీసుకొని వెళ్ళండని మినిస్టర్ చెప్తాడు. ఆ తర్వాత మినిస్టర్ ని పంపించడానికి రిషి వాళ్ళు వెళ్తారు. కాసేపటికి ఎండీ చైర్ లో వసుధార హుందాగా కూర్చొని ఉంటే చూడలేని దేవయాని.. నక్క తోక తొక్కావని అంటుంది. ఎండీ చైర్ రాలేదు అన్న కోపం ఒకటి అయితే ఎండీ చైర్ లో నన్ను కూర్చోపెట్టారు అన్న కోపం మీకు ఎక్కువగా ఉందని శైలేంద్రతో వసుధార అంటుంది. ఆ తర్వాత నేను జగతి మేడమ్ అంత మంచిదాన్ని కాదు ఒక చెంప కొడితే రెండు చెంపలు వాయించే రకమని వసుధార చెప్తుంది.
కాసేపటికి రిషి వచ్చి వసు తో మాట్లాడుతాడు. మీరు మనస్పూర్తిగా నన్ను ఎండీ చైర్ లొ కూర్చోపెట్టారా అని వసుధార అడుగుతుంది. అవును మనస్పూర్తిగా కూర్చోపెట్టానని రిషి అంటాడు. ఆ తర్వాత శైలేంద్ర కోపంగా ఇంటికి వెళ్తాడు. మీరు చేసే ప్రతి పని నాకు తెలుసని శైలేంద్రతో ధరణి అనగానే.. అప్పటికే బాధలో ఉండి, మరింత చిరాకుతో శైలేంద్ర కొప్పడతాడు. ఎలాగైనా రిషి మాములుగా అయ్యాక నిజం చెప్పాలని ధరణి అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.