English | Telugu
బిగ్ బాస్ లో ఈ సారి కెప్టెన్సీ పదవి లేదు.. హౌస్ లో ముగ్గురు ఛీఫ్ లు వాళ్ళెవరంటే!
Updated : Sep 3, 2024
బిగ్ బాస్ హౌస్ లో రెండో రోజు గొడవలతో, టాస్క్ లతో ఫుల్ కంటెంట్ దొరకింది. అయితే ఈసారి హౌస్ లో కెప్టెన్లు లేరంటూ ముందే బిగ్‌బాస్ క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కెప్టెన్లు కాకుండా ఆ ప్లేస్‌లో ముగ్గురు చీఫ్‌లు ఉంటారని బిగ్‌బాస్ చెప్పాడు.
ఇక సీజన్ గ్రాండ్ లాంఛ్ టైమ్‌లో విన్ అయిన మూడు బడ్డీ జంటలకి మొదటి టాస్కు పెట్టాడు బిగ్‌బాస్ . "పట్టుకొని ఉండండి వదలకండి" అంటూ పెట్టిన ఈ టాస్క్ ప్రకారం.. ఒక కేజ్‌లో రంగు రంగుల తాళ్లు ఉన్నాయి. వాటిని ఎక్కువసేపు పట్టుకోవాల్సి ఉంటుంది. అయితే పట్టుకున్న వాళ్ల తాడును స్పిన్నింగ్ వీల్‌లో వచ్చే కలర్ బట్టి సంఛాలక్ కట్ చేస్తుంటాడు. చివరి వరకు ఎవరు ఉంటారో వాళ్లే విన్నర్. ఇక ఈ గేమ్‌లో బేబక్క, యష్మీ గౌడ, నబీల్, నిఖిల్, నైనిక, శేఖర్ బాషా పాల్గొన్నారు. ఇందులో చివరి వరకు నిలబడి నిఖిల్ విన్నర్ కావడంతో హౌస్‌కి మొదటి చీఫ్ అయిపోయాడు.
మొదటి టాస్కులో ఓడపోయిన ఐదుగురు కంటెండర్లకి బిగ్ బాస్ మరో అవకాశం ఇచ్చాడు. కోన్ గేమ్ అంటూ పెట్టిన రెండో టాస్కులో నైనిక అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చింది. ఈ టాస్కులో గెలిచి హౌస్‌కి రెండో చీఫ్ అయిపోయింది. అయితే ఈ టాస్కుకి కిరాక్ సీత సంచాలక్‌గా చేసింది. ఆ సమయంలో తనని పక్కకెళ్లి ఆడుకోమంటూ నిఖిల్ అనడం తనకి నచ్చలేదంటూ గేమ్ అయిపోయిన తర్వాత మణికంఠతో చెప్పింది సీత. అప్పటికే నిఖిల్‌తో గొడవ అవ్వడంతో.. నువ్వు సైలెంట్‌గా ఉండకు ముఖం మీదే చెప్పెయ్ అంటూ సీతతో మణికంఠ అన్నాడు.
మిగిలిన నలుగురిలో ఒకరిని చీఫ్‌గా సెలక్ట్ చేయాలంటూ అప్పటికే చీఫ్‌లు అయిన నిఖిల్, నైనికలను కోరాడు బిగ్‌బాస్. ఇక్కడే అసలు గేమ్ స్టార్ట్ అయింది. మిగిలిన నలుగురిలో గేమ్ పరంగా చూసుకుంటే నబీల్, శేఖర్ బాషా బాగా ఆడారు. బేబక్క అయితే అసలేం ఆడలేదు. యష్మీ కూడా ఫర్లేదు కాబట్టి యష్మీని చీఫ్‌గా సెలక్ట్ చేద్దామంటూ నైనికతో నిఖిల్ అన్నాడు. నైనిక మాత్రం నబీల్ బాగా ఆడాడంటూ చెప్పింది. కానీ కన్విన్స్ చేసేసి మరీ సింపుల్‌గా యష్మీని సెలక్ట్ చేయించేశాడు నిఖిల్.
నేను సరిగ్గా టాస్కులో పర్ఫామ్ చేయలేదు.. కానీ నాలో ఏం చూసి మీరు నన్ను సెలక్ట్ చేశారో నాకు తెలియదు. చీఫ్‌లుగా ఉండటానికి మీరు అర్హులని ఈ నిర్ణయంతో తెలిసింది. ఇదంతా నా అదృష్టం ఏమో అంటూ చెప్పుకొచ్చింది యష్మీ. ఇక్కడే మిగిలిన కంటెస్టెంట్లకి కాలింది. తను సరిగా ఆడలేదని తనే ఒప్పుకున్నా కూడా యష్మీని చీఫ్‌గా ఎలా సెలక్ట్ చేశారంటూ తగులకుంది సోనియా ఆకుల. తనకంటే అన్ని విధాలా టాస్కుల్లో, మాట్లాడటంతో అన్నింట్లో నబీల్ బెస్ట్ అంటూ సపోర్ట్ చేసింది. యష్మీ అసలు చాలా బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించింది. చాలా విషయాల్లో ఆమె కంటే నబీల్ బెస్ట్ అంటూ వాయిస్ రెయిజ్ చేసింది సోనియా. దీంతో తన గురించి ఎందుకు లాగుతన్నావంటూ యష్మీ కూడా గొడవకి దిగింది. కానీ యష్మీ వైపు చూడకుండా నిఖిల్, నైనికలకి పాయింట్ టూ పాయింట్ ఇచ్చిపడేసింది సోనియా ఆకుల. చీఫ్ అంటే ఏదో అదృష్టం వల్ల ఇవ్వడం కాదు ఎవరు అర్హులో వాళ్లకి ఇవ్వాలి.. ఇక్కడ ఫ్రెండ్ షిప్‌ను చూడటం కరెక్ట్ కాదంటూ సోనియా ఫైర్ అయ్యింది.