English | Telugu

Bezawada Bebakka vs Sonia : కుక్కర్ తో మొదలైన హీటెడ్ ఆర్గుమెంట్స్!

బిగ్ బాస్ సీజన్-8 లో హీటెడ్ ఆర్గుమెంట్స్ మొదలయ్యాయి. ఎవరు తగ్గట్లేదు.. మొదట హౌస్ లోకి నాగ మణికంటని బయటకి పంపిద్దామని అందరు ఓట్ చేయగా.. అతను అందరి మీద చాలా కోపంగా ఉన్నాడు. దాంతో నిఖిల్ వెళ్ళి వివరించే ప్రయత్నం చేయగా అతను వినిపించకపోగా నిఖిల్ ని సాగదీయకని చెప్పాడు.

ఇక హౌస్ లోకి బిగ్ బాస్ ఫుడ్ ఐటమ్స్ పంపించగా అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇక హౌస్ లో అందరు ఎవరి డ్యూటీ ఏంటో వాళ్ళు ఫిక్స్ అయ్యారు.‌ఇక కిచెన్ లోకి బేబక్క అండ్ టీమ్ వెళ్ళారు. ఇక బిగ్ బాస్ పంపిన కొత్త కుక్కర్ తో హౌస్ మేట్స్ తంటాలు పడ్డారు. కుక్కర్ లో సరిగ్గా పప్పు ఉడకడం లేదంటూ బేబక్క వచ్చి సోఫాలో కూర్చుంది. 'మా ఆకలంటే మీకు ఇర్రెస్పాన్సిబుల్ ఆ' అంటూ బేబక్క మీద సోనియా ఫైర్ అయ్యింది. అది ఫుడ్ .. అందరు ఆకలితో ఉన్నారు.. ‌ఇప్పుడు వచ్చి కుక్కర్ ఆఫ్ చేసి కూర్చుంటే ఎలా అంటూ సోనియా అనగానే.. నిఖిల్ వివరించే ప్రయత్నం చేశాడు. అయిన సోనియా తగ్గకుండా గొడవ పెట్టుకోవాలనే వాయిస్ ఎక్కువ చేసి బేబక్క మీద ఫైర్ అయింది. దానిని బేబక్క సున్నితంగా తీసుకొని సోనియాతో గొడవ పడకుండా కుక్కర్ దగ్గరికు వెళ్ళి మళ్ళీ ప్రయత్నం చేసింది. దాంతో గొడవ జరగకుండా అది ముగిసింది.

అయితే సోనియా మాత్రం కంటెంట్ కోసమే చేస్తున్నట్లు ఒక వర్గం ఆడియన్స్ అనిపించగా.. మరోవిధంగా తను వ్యాలిడ్ పాయింట్లే మాట్లాడుతుందని అనిపిస్తుందని అనేవారు కూడా ఉన్నారు. మొత్తానికి ఈ ఆర్జీవీ బ్యూటీ ఛాన్స్ దొరికినప్పుడల్లా ఎవరినో ఒకరికి టార్గెట్ చేస్తూ ఇచ్చిపడేస్తుంది. హౌస్ లో జరిగే టాస్క్ లలో, గేమ్స్ లలో ఈ బ్యూటీ ఎలా పర్ఫామెన్స్ చేస్తదో చూడాలి మరి.

Podharillu:పొదరిల్లు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. మహాలక్ష్మికి పెళ్ళి ఫిక్స్!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పోదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -02 లో.....మహాలక్ష్మి ప్రాజెక్ట్ డిజైన్ రెడీ చేసి హాల్లోకి వస్తుంది. వాళ్ళ నాన్న ప్రతాప్ ఇంకా అన్నయ్య మహాలక్ష్మికి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తారు. ఒకసారి చూడు మహా అని వాళ్ళ అన్నయ్య అంటాడు. నాకేం ఇప్పుడు పెళ్లి వద్దు అవసరం అయితే వదిన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని మహా అంటుంది. ఇప్పుడు డిజైన్స్ చూపించడానికి వెళ్తున్నానని తెలిస్తే డాడీ వద్దని అంటాడనుకొని డాడీ కాలేజీలో సర్టిఫికెట్ ఉన్నాయి తెచ్చుకుంటానని చెప్తుంది.