English | Telugu

హౌస్ మేట్స్ కి వార్నింగ్ ఇచ్చిన నాగార్జున.. యావర్ కి సపోర్ట్!

బిగ్ బాస్ సీజన్-7 ఇప్పుడు అందరిని ఆకర్షిస్తుంది. గత ఐదు వారాల నుండి వరుసగా అమ్మాయిలు ఎలిమినేట్ అవ్వడంతో.. గ్లామర్ కి ఇంపార్టెంటెన్స్ ఇచ్చే ఈ షో, ఆడియన్స్ ఓటింగ్ ని బట్టి బయటకు పంపించడమేంటని ప్రేక్షకులు భావిస్తున్నారు. శుక్రవారం వరకు కెప్టెన్సీ కోసం ఆటగాళ్ళు, పోటుగాళ్ళు టాస్క్ లు ఆడిన విషయం తెలిసిందే. అందులో ఆటగాళ్ళ టీమ్ నుండి యావర్ కెప్టెన్ గా ఎంపిక అయ్యాడు.

అయితే శనివారం జరిగిన ఎపిసోడ్ లో.. నాగార్జున వచ్చీ రాగానే శుక్రవారం హౌస్ లో ఏం జరిగిందో ఆడియన్స్ కి బిగ్ స్క్రీన్ మీద చూపించాడు. దాని తర్వాత హౌస్ మేట్స్ తో మాట్లాడాడు. అమర్ దీప్ ని లేపి చప్పట్లు కొట్టాడు నాగార్జున. సర్ ఏంటి సర్ అని అమర్ దీప్ అనగానే.. చాలా బాగా ఇంప్రూవ్ అయ్యావ్. కానీ నీలో 50% మాత్రమే ఇచ్చావ్. ఐ వాంట్ యువర్ 100% అని నాగార్జున అన్నాడు. ఆ తర్వాత ప్రిన్స్ యావర్ ని లేపి.. టాస్క్ లలో నీ వంద శాతం ఎఫర్ట్స్ పెట్టావ్. సూపర్.. సెకండ్ కెప్టెన్ ఆఫ్ ది హౌజ్ అని చెప్పి చప్పట్లు కొట్టించాడు నాగార్జున. కాసేపటికి పల్లవి ప్రశాంత్ ని లేపి.. ఎలా ఉంది కెప్టెన్ గా చేశావ్ కదా అని నాగార్జున అడుగగా.. బాగుంది సర్. కానీ నేను చెప్తే కొందరు వినలేదు సర్. అనవసరంగా ఫుడ్ వేస్ట్ చేస్తున్నారు సర్ అని ఆట సందీప్, ప్రియాంక జైన్, గౌతమ్ కృష్ణ గురించి చెప్పాడు. ఇక వాళ్ళు కావాలని చేయలేదని, అంతమందికి కాస్త ఎక్కువైందని అది కూడా పారేయలేదని ఫ్రిడ్జ్ లో పెట్టామని సీరియల్ బ్యాచ్ వివరణ ఇచ్చారు. ఇక ఒక్కసారికి అయితే ఒకే మళ్ళీ మళ్ళీ ఇలాగే జరిగితే నాకు చెప్పమని పల్లవి ప్రశాంత్ తో నాగార్జున అన్నాడు.

ఇక కెప్టెన్ గా నీకు ఎదురైన సమస్యేంటని యావర్ ని నాగార్జున అడుగగా.. వీఐపీ రూమ్ లోని ఫ్రిడ్జ్ లో ఉన్న కూల్ డ్రింక్ నేను తాగాలా? హౌస్ మేట్స్ తాగాలా అని నాగార్జునని యావర్ అడిగాడు. అది నీ ఇష్టం. వీఐపీ రూమ్ లోకి నీకొక్కడికే పర్మిషన్ ఉంది. ఎవరు వెళ్ళకూడదు. రోజుకొక కూల్ డ్రింక్ నువ్వు తీసుకోవచ్చు. అది ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అని నాగార్జున చెప్పాడు. ఇక ప్రియాంక జైన్ మధ్యలో మాట్లాడిందని చెప్పగా నేను కూడా చూశానని, తప్పేం కాదని యాక్షన్ ని బట్టి రియాక్షన్ ఉంటుందని నాగార్జున అన్నాడు. ఆ తర్వాత యావర్, అమర్ దీప్ మధ్య జరిగిన డిస్కషన్ లో ఆట సందీప్ నువ్వు ఎందుకు వచ్చావని అతడికి వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున.