English | Telugu
Shobha Shetty: బిగ్ బాస్‌లో వరెస్ట్ కెప్టెన్.. అమర్ దీప్ డైరెక్షన్‌లో శోభాశెట్టి
Updated : Nov 7, 2023
బిగ్ బాస్ హౌస్ లో వారానికో కెప్టెన్ మారుతుంటారు. వారమంతా టాస్క్ లలో ఆటతీరుతో, హౌస్ మేట్స్ తో మాట్లాడే మాటతీరుతో ఎవరైతే ఆకట్టుకుంటారో వారే కెప్టెన్ అవుతారని అందరికి తెలిసిందే.
గతవారం జరిగిన టాస్క్ లలో శోభాశెట్టి గెలిచి కెప్టెన్ అయిన సంగతి తెలిసిందే. ఇక శోభాశెట్టి కెప్టెన్ అవ్వడంతోనే తన సీరియల్ బ్యాచ్ మేట్స్ అమర్ దీప్, ప్రియంకలకి కూడా కెప్టెన్సీ పగ్గాలు అప్పగించినట్టు స్పష్టమవుతుంది. నిన్న జరిగిన నామినేషన్లలో కూడా రతికకి రెండు ఓట్లు, ప్రియాంకకి రెండు ఓట్లు వచ్చి టై అవ్వడంతో బిగ్ బాస్ కెప్టెన్ గా శోభాశెట్టి నిర్ణయం అడిగాడు. దాంతో తన బడ్డీ ప్రియాంకని నామినేషన్ లో ఉండనీయకుండా రతికను నామినేట్ చేసింది. ఆ తర్వాత హౌస్ లో ఎవరికేం పనులు అప్పగించాలని అమర్ దీప్, ప్రియంక చెప్తూండటాన్ని బిగ్ బాస్ లైవ్ లో చూపించాడు. ఆటల్లో కలిసే ఆడతారు. హౌస్ లో ఉన్నప్పుడు కలిసే ఉంటారు. కనీసం కెప్టెన్సీ అయిన కొంచెం ఫెయర్ గా చేయండ్రా బాబు అంటు నెటిజన్లు సీరియల్ బ్యాచ్ కి చురకలు వేస్తున్నారు. ఇక ఫ్యామిలీ వీక్ మొదలైంది. ఇక మాములుగా అతిచేసే శోభాశెట్టి, ప్రియాంక, అమర్ దీప్ లు.. ఫ్యామిలీ వీక్ లో ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తారో అంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.
కిచెన్ మొత్తం క్లీన్ చేసే డ్యూటీ శివాజీకి అప్పగిద్దామని అమర్ దీప్ శోభాశెట్టికి చెప్పడం, పల్లవి ప్రశాంత్ తో బాత్ రూమ్ లు క్లీన్ చేపిద్దామని ప్రియాంక చెప్పడంతో.. సరేనని శోభాశెట్టి అంది. ఇలా వాళ్ళిద్దరు చెప్పే మాటలు వింటు వరెస్ట్ కెప్టెన్ అనిపించుకుంటుంది శోభాశెట్టి. మరి వీకెండ్ లో శోభాశెట్టి కెప్టెన్ గురించి నాగార్జున ఎలా స్పందిస్తాడో చూడాలి మరి.