English | Telugu

శివాజీ కొడుకును బిగ్ బాస్ ఎందుకు తీసుకు వచ్చాడు... అసలు ఏం జరిగింది!

బిగ్ బాస్ సీజన్-7 నిన్నటి వరకు టాస్క్, ఎలిమినేషన్, నామినేషన్ అంటు ఆకట్టుకుంది. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ మొదలైంది. ఒక్కో కంటెస్టెంట్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వస్తుంటే వాళ్ళ మధ్య బాండింగ్ అంతా బిగ్ స్క్రీన్ పై చూస్తూ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు. అందుకనే ఫ్యామిలీ వీక్ కి ఇంత క్రేజ్. అయితే తాజాగా విడుదలైన బిగ్ బాస్ ప్రోమో మరింత ఆసక్తిగా ఉంది.

ఫ్యామిలీ వీక్ లో భాగంగా శివాజీ పెద్ద కొడుకు బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. హౌస్ లో అందరు మాములుగా ఎవరి పనుల్లో వారున్నప్పుడు.. శివాజీ మీరు‌ మెడికల్ రూమ్ కి రండి అని బిగ్ బాస్ అనగానే.. ఒకే బిగ్ బాస్ అంటూ శివాజీ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక డాక్టర్ శివాజీని చూసి.. నొప్పి ఏం అయినా ఉందా? అని అడిగాడు. కాస్త ఉందని శివాజీ చెప్తాడు. ఒక రెండు మూడు రోజుల్లో అంతా సెట్ అవుతుందని డాక్టర్ చెప్పడంతో.. ఎస్ ఐ విష్.. నేను ఆడతానని శివాజీ చెప్పి బయటకు వస్తుంటాడు. అప్పుడే నాన్న అని వెంకట్ అనగానే.‌. వెనక్కి తిరిగి చూస్తాడు శివాజీ. మాస్క్ గ్లాసెస్ అన్నీ తీసేసిన వెంకట్ చూసి శివాజీ హత్తుకొని ఏడ్చేశాడు. శివాజీ కళ్ళలో నీళ్ళు తిరిగాయనే చెప్పాలి.

ఆ తర్వాత శివాజీ, వెంకట్ బయటకు వచ్చి.. నా కొడుకు అంటు హౌస్ మేట్స్ తో శివాజీ చెప్పడంతో అందరు మోస్ట్ సర్ ప్రైజ్ గా ఫీల్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక పల్లవి ప్రశాంత్ పరుగున వెళ్ళి హత్తుకున్నాడు. శోభాశెట్టి, అమర్ దీప్, భోలే అందరు సర్ ప్రైజ్ అయ్యారు. ఇక అందరిని కలిసాక శివాజీతో ఒంటరిగా మాట్లాడాడు వెంకట్. నువ్వు వస్తావనుకోలేదు‌. తమ్ముడు వస్తాడనుకున్నాను. నీకు సిగ్గు కదా అని శివాజీ అనగానే.. నాకు యూనివర్సిటీది డేట్ 8th కి ఉంది. మళ్ళీ నువ్వు వచ్చేసరికి కలిసే వీలుంటదో ఉండదో అని వచ్చానని వెంకట్ అనగానే.. శివాజీ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. ఇది బిగ్ బాస్ సీజన్-7 లోనే మోస్ట్ ఎమోషనల్ ఎపిసోడ్ అవుతుంది. కాగా ఇప్పుడు ఈ బిగ్ బాస్ ప్రోమో యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.