English | Telugu

అఖిల్ ని వర్జినా? కాదా అని అడిగిన నెటిజన్!

అఖిల్ సార్థక్.. బిగ్ బాస్ -4 లో రన్నర్ గా నిలిచిన విషయం అందరికి తెలిసిందే. కాగా ఆ షోలో మోనల్ కోసం అభిజిత్ తో కలిసి పోటాపోటీగా సాగిన కోల్డ్ వార్ అందరికి గుర్తుండే ఉంటుంది. అన్ని సీజన్లలో కన్నా ఎక్కువ మంది ఇష్టపడింది, గుర్తుండిపోయింది బిగ్ బాస్-4. ఈ సీజన్ లో అఖిల్ సార్థక్ తన అటిట్యూడ్ తో ప్రేక్షకులలో మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. అయితే తాజాగా ముగిసిన బిబి జోడీలో అఖిల్, మోనల్ గజ్జర్ తో‌ జతకడతాడని ప్రేక్షకులు భావించారు. కానీ అనుకోకుండా తేజస్వినితో కలిసి డ్యాన్స్ పర్ఫామెన్స్ ఇచ్చాడు. అయినా కానీ ఎక్కడ కూడా తగ్గకుండా మెరుగైన పర్ఫామెన్స్ ఇచ్చాడు. బిబి జోడీ స్టేజ్ మీద వీళ్ళిద్దరి కెమిస్ట్రీ బాగుందనే చెప్పాలి‌. అదే విషయం చాలాసార్లు బిబి జోడీలోని జడ్జ్ లు చెప్పారు.

బిబి జోడీలోని మొదటి రెండు వారాల్లో అఖిల్-తేజస్విని వాళ్ళ హాట్ పర్ఫామెన్స్ తో జడ్జ్ లకే చెమటలు పట్టించారు. అయితే ఆ షోలో విన్నర్ గా వీళ్ళ జోడి నిలుస్తుందని అనుకున్నారంతా కానీ అనుకోకుండా అఖిల్ కి కాలికి గాయం కారణంగా డాక్టర్స్ డ్యాన్స్ చేయకూడదని చెప్పడంతో వాళ్ళ జోడీ షో నుండి బయటకొచ్చేసారు.

అయితే తాజాగా అఖిల్ సార్థక్ ' ఆస్క్ మీ క్వశ్చన్ ' స్టార్ట్ చేశాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రశ్న అడుగగా, అలా అడిగిన వాటిలో కొన్నింటికి సమాధనమిచ్చాడు అఖిల్. ' ఆర్ యూ వర్జిన్ ' అని ఒకరు అడుగగా.. ఏం చెప్పాలో తెలియక, ఏం క్వశ్చన్ రా బాబు అన్నట్టుగా చూశాడు అఖిల్. బిబి స్టార్స్ ప్రోగ్రామ్ కి ఎందుకు వెళ్ళలేదని ఒకరు అడుగగా.. ముంబాయిలో షూటింగ్ కి వెళ్ళానని చెప్పాడు అఖిల్. సంథింగ్ ఈజ్ కమింగ్ సూన్ అని అన్నారు కదా? అదేంటో చెప్పగలరా అని ఒకరు అడుగగా.. నాకు చిన్న ప్రాజెక్టు అయినా పెద్దదే తొందరలోనే వస్తుంది.. అఫీషియల్ గా బయటకొచ్చాక, నేను కూడా పోస్ట్ చేస్తానని అఖిల్ చెప్పాడు. నీ ప్రకారం ఫ్రెండ్ షిప్ అంటే ఏంటని ఒకరు అడుగగా.. నా అవసరాలను పక్కన పెట్టి, ఫస్ట్ వాళ్ళ అవసరాలని తీర్చడం, వాళ్ళ కోసం ఎంతమందితోనైనా కొట్లాడటం, సెల్ఫిష్ ఉండకపోవడమంటూ అఖిల్ సార్థక్ సమాధానమిచ్చాడు.