English | Telugu
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో జబర్దస్త్ టీమ్..ఇంతకు ఎం చేసారంటే?
Updated : Mar 2, 2024
జబర్దస్త్ టీమ్ 25 రోజులలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి 100కు పైగా ప్రదర్శనలు ఇచ్చినట్లు రీసెంట్ గా ఒక వీడియోని పోస్ట్ చేసాడు జబర్దస్త్ కమెడియన్ అదిరే అభి. ఇంతకు ఏమయ్యింది అంటే...ఏలూరులో బిజెపి లీడర్ గారపాటి సీతారామాంజనేయ తరుపున కమలరధం పేరుతో జబర్దస్త్ కళాకారులు, మూవీ సింగర్స్ తో ఏర్పాటైన ఒక బృందం 25 రోజుల్లో పలు ప్రాంతాల్లో పర్యటించి 100కు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఐతే ఈ ప్రచారం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు ఏలూరులోని సుంకరి వారి తోటలో ఈ టీమ్ నిర్వహించిన 102వ ప్రదర్శన తిలకించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేశారు.
ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధి సుప్రీంకోర్టు న్యాయవాది వరప్రసాద్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కమల రధం ప్రచారాన్ని ముందుండి నడిపించిన వారిలో పాటల రచయిత అనంత శ్రీరామ్, జబర్దస్త్ కళాకారులు అదిరే అభి, ఇమ్మానుయేల్, జబర్దస్త్ అప్పారావు, వినోద్, బాబి, సినీ గాయని, గాయకులు లాస్య ప్రియ, అరుణ్ కౌండిన్య వున్నారు. ఈ బృందానికి అవార్డును, మెడల్స్ ను అందించారు. పొలిటికల్ పార్టీ తరపున ప్రచార రథం ద్వారా సినీ, టీవీ కళాకారులు 25 రోజుల్లో 100 ప్రదర్శనలు ఇవ్వడం దేశంలో ఇదే మొదటి సారి అన్నారు. బిజెపి తరఫున 26 రోజులు పర్యటించి 104 ప్రదర్శనలు పూర్తి చేసినట్లు చెప్పాడు జబర్దస్త్ కళాకారుడు అదిరే అభి అన్నారు. ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ ఐనందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు అనంత శ్రీరామ్.