English | Telugu
మీరు వెళ్ళింది భక్తి కోసమా,ఇన్‌స్టా స్టోరీ కోసమా...లాస్యకి నెటిజన్ కౌంటర్
Updated : Feb 2, 2025
ప్రయాగ్ రాజ్ లో మహా కుంభమేళా జరుగుతున్న విషయం తెలిసిందే. భక్తులు కూడా కోట్ల మంది వెళ్లి పుణ్యస్నానాలు చేసుకుంటూ వస్తున్నారు. సామాన్యులు మాత్రమే కాదు దేశ విదేశాల నుంచి సెలబ్రిటీలు కూడా ఈ వేడుకలకు హాజరవుతున్నారు. ఇక రీసెంట్ గా యాంకర్ లాస్య తన ఫ్యామిలీతో కలిసి మహా కుంభమేళాలో సందడి చేసింది. లాస్య అక్కడ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం చేసింది. మహాకుంభమేళలో తమ పర్యటనకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. "సంగమంలో ఒక పవిత్ర మునక వేసేసరికి నాలో ఏదో పాజిటివ్ ఎనర్జీ వచ్చినట్టుగా అనిపించింది " అంటూ కామెంట్ చేసింది. ఇక ఈ పిక్స్ చూసాక నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. "అక్కడ కూడా ఫోటో షూట్స్ అవసరమా. మీరు వెళ్ళింది భక్తి కోసమా లేక ఇన్స్టా స్టోరీల కోసమా" అంటూ ఒక నెటిజన్ ఘాటుగా అడిగాడు. ఇంకొంతమంది ఐతే "అక్కడికి వెళ్లడానికైనా అదృష్టం ఉండాలి. సూపర్. ఆ నీటిలో చేపలు ఉన్నాయా..? అక్కడ పరిస్థితి ఎలా ఉందో చెప్పండి...అక్కడికి వెళ్లిన ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ? కార్ పార్కింగ్ ఎక్కడ చేసుకున్నారో చెప్పండి ? అంటూ అడుగుతున్నారు. ఐతే ఈ మధ్య సెలబ్రిటీస్ అంతా కూడా భక్తిని ఇలా వీడియోస్ పిక్స్ తీసి పబ్లిక్ కి షేర్ చేస్తున్నారు. షేర్ చేయడంలో తప్పు లేదు కానీ. కొన్ని అంశాల్లో మరీ ఇలాంటి వాటికి దూరంగా ఉండడమే బెటర్. డివోషనల్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు మనసు దేవుడి మీద లగ్నం చేస్తే కొంచెం మనఃశాంతి దక్కుతుంది.