English | Telugu

త్వరలో జబర్దస్త్ కమెడియన్ పెళ్లి...అందరికీ ఇన్విటేషన్ ఇస్తాం అంటూ...

ఈ మధ్య కాలంలో మూవీ యాక్టర్స్ తో సమానంగానే బుల్లితెరపై న‌టించే వారికి కూడా మంచి క్రేజ్ వస్తోంది. అలాంటి వారిలో యంగ్ క‌మెడీయ‌న్ నూక‌రాజు కూడా ఒక‌డు. సక్సెస్‌ఫుల్‌గా కెరీర్‌ను బిల్డ్ చేసుకుంటూ వచ్చాడు. అలాగే తన లవర్ ఆసియాతో కూడా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాడు. ’పటాస్’ షోలో చేస్తున్న దగ్గర నుంచి ఆసియాతో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఇక యూట్యూబ్ వీడియోల్లో ఈ జంట సంద‌డి చేస్తూ ఉంటారు.

ఇక ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో వీళ్ళు ఒక గుడ్ న్యూస్ కూడా చెప్పారు. ఐతే ముందు నూకరాజు ప్రభ అనే అమ్మాయితో కలిసి వాళ్ళ ట్రెండింగ్ సాంగ్ కి పాట పాడి డాన్స్ చేసాడు. "గుట్ట కింద " సాంగ్ కి అద్దిరిపోయే వాయిస్ తో పాట పాడాడు. ఆ తర్వాత రష్మీ ఆసియాని స్టేజి మీదకు పిలిపించింది. దాంతో నూకరాజు మళ్ళీ ఆ లిరిక్స్ పడడంతో ఆసియా డాన్స్ చేసింది. ఇక ఇంద్రజ, హైపర్ ఆది వాళ్ళ పాటకు, డాన్స్ కి ఫిదా ఇపోయారు. ఇక ఇంటికి వెళ్లి దిష్టి తీయించుకోండి అని సలహా ఇచ్చింది. అలాగే మరి ఇద్దరూ కలిసి గుడ్ న్యూస్ ఎప్పుడు చెప్తారు అంటూ కూడా అడిగింది. ప్రతీ ఒక్కరికి కార్డు ఇచ్చి మరీ గుడ్ న్యూస్ చెప్తాము రెండు, మూడు నెలల్లో అని చెప్పాడు నూకరాజు. ఐతే రెండు మూడు నెలల్లో ఇద్దరికీ పెళ్లి కాబోతోంది అన్న విషయాన్నీ నూకరాజు ఇన్డైరెక్ట్ గా చెప్పేసాడు.