English | Telugu

చెప్పుకోదగ్గ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ లేవు.. ఢీ షో చాలా స్లోగా ఉంది

ఢీ షో క్వార్టర్ ఫైనల్స్ కి అడుగుపెట్టింది. కానీ ఆ ఫైర్, జోష్ అనేవి ఈ ఎపిసోడ్ లో ఎక్కడా కనిపించలేదు. ఆ హడావిడి లేదు. ఎంతసేపు ఆది, అఖి, ప్రదీప్ కుళ్ళు జోక్స్ చెత్త స్కిట్స్ తప్ప. డాన్స్ షోలో స్కిట్ ఏంటో అని నెటిజన్స్ కూడా పెదవి విరుస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ షో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయ్యింది. జతిన్, మహాలక్ష్మి డాన్స్ చేసాక ప్రదీప్ ఒక టాస్క్ ఇచ్చాడు. ఆదికి శ్వేతకి, అఖిల్ కి నయనిపావనికి పెళ్ళైతే అని ప్రదీప్ ఒక లైన్ చెప్పేసరికి ఒక కామెడీ స్కిట్ అనేది ఢీ 14 షోలో పేలింది.

అఖిల్ ఆఫీస్ కి వెళ్తూ ఆదిని భోజనం చేశారా అనేసరికి "ఎక్కడా చేసే లోపే నువ్వొచ్చావ్" అన్నాడు ఆది. ఇంతలో ప్రదీప్ బుక్ పట్టుకొచ్చి "రావు గారు కెమిస్ట్రీలో నాకు ఒక డౌట్ ..ఔరంగజేబు a + b హోల్ స్క్వేర్ అనేసరికి "ఏమిటి నీకేమన్నా మెంటలా కెమిస్ట్రీ లో ఔరంగజేబ్ కాదు ఉండేది అవి ఉంటాయి" అని డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పాడు ఆది. ఇక జతిన్, మహాలక్ష్మి, తనుశ్రీ డాన్స్ పెర్ఫార్మెన్సెస్ అదిరిపోయాయి. ఇక ఆది కెమిస్ట్రీ గురించి చెప్పేసరికి నెటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు. "ఆది ఆకలికి బాగా ఆలవాటు పడ్డారు.. ఆది ఫైర్" అని ఎమోజిఎస్ పెట్టి కామెంట్స్ పెట్టారు. అంతే కాదు ఈ షో మీద కూడా నెగటివ్ కామెంట్స్ వస్తున్నాయి. " చెప్పుకోదగ్గ డాన్స్ లేదు..... ఢీ షో చాలా స్లోగా ఉంది. క్వార్టర్ ఫైనల్స్ కి మ్యాచ్ అయ్యే డాన్స్ అసలు లేదు. ఇంతక ముందు ఢీ షో చాలా బాగుండేది." అని అంటున్నారు నెటిజన్స్.